వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

NEET 2020: ఇద్దరికి 720/720 - షోయబ్, ఆకాంక్ష సంచలనం - టాప్-10లో తెలుగు తేజాలు

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్ టెస్ట్ (NEET 2020) ఫలితాల్లో ఈసారి సంచలనాలు నమోదయ్యాయి. 180 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకుగానూ మొత్తం 720 మార్కులకు పరీక్ష నిర్వహించగా.. చరిత్రలో తొలిసారి ఇద్దరు విద్యార్థులు నూటికి నూరు శాతం స్కోరు సాధించారు. ఓడిశాకు చెందిన షోబయ్ అఫ్తాబ్, ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్ లు 720/720 మార్కులు సాధించారు. అయితే టై బ్రేకర్ విధానంలో షోయబ్ ఫస్ట్ ర్యాంకర్ గా నిలవగా, అతని కంటే వయసులో కొద్ది నెలలు చిన్నదైన ఆకాంక్ష రెండో ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

సీఎంగా వైఎస్ భారతి లేదా విజయమ్మ - సారీ చెప్పకుంటే జగన్ పదవి పోవడం ఖాయం: ఎంపీ రఘురామసీఎంగా వైఎస్ భారతి లేదా విజయమ్మ - సారీ చెప్పకుంటే జగన్ పదవి పోవడం ఖాయం: ఎంపీ రఘురామ

 టాప్-10లో తెలుగు విద్యార్థులు..

టాప్-10లో తెలుగు విద్యార్థులు..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) శుక్రవారం సాయంత్రం నీట్2020 ఫలితాలను విడుదల చేసింది. మెడికల్ కౌన్సిలింగ్ కు అర్హత సాధించిన విద్యార్థుల జాబితాతోపాటు వారి ర్యాంకులను సైతం ఎన్‌టీఏ ప్రకటించింది. నీట్ 2020 ఫలితాల్లో టాప్-10 ర్యాంకులు పొందినవాళ్లలో తెలుగు విద్యార్థులు కూడా ఉండటం గమనార్హం. ర్యాకుల వారీగా ఆ వివరాలివి.. షోయబ్ అఫ్తాబ్(1ర్యాంక్- 720 మార్కులు), ఆకాంక్ష సింగ్(2వ ర్యాంక్ - 720 మార్కులు), తుమ్మల స్నికిత(3వ ర్యాంక్ - 715 మార్కులు), వినీత్ శర్మ(4 - 715), అమిృష ఖైతాన్(5 - 715), గుంతి చైతన్య సింధు(6- 715), సాత్విక్ గోదర(7- 711), శ్రీజన్.ఆర్(8- 710), కార్తిక్ రెడ్డి(9- 710), మట్రవడియ మానిత్ (10వ ర్యాంకు - 710 మార్కులు).

దేశంలోనే త్రిపుర టాప్

దేశంలోనే త్రిపుర టాప్

కరోనా విలయం కారణంగా పలు మార్లు వాయిదా పడి, సెప్టెంబర్ లో జరిగిన నీట్ 2020 పరీక్షలకు మొత్తం 13.66లక్షల మంది హాజరుకాగా, అందులో కేవలం 7,71,500 మంది మాత్రమే కౌన్సిలింగ్ దశకు క్వాలిఫై అయ్యారు. ఆశ్చర్యకరంగా నీట్2020లో అత్యధిక క్వాలిఫికేషన్లు సాధించి త్రిపుర దేశంలోనే టాప్ లో నలిచింది. త్రిపుర నుంచి మొత్తం 88,889 మంది విద్యార్థులు తదుపరి దశకు అర్హత సాధించారు. తర్వాతి స్థానంలో ఉన్న మహారాష్ట్ర నుంచి 79,974మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.

ర్యాంక్ రాలేదని బాధపడొద్దు.

ర్యాంక్ రాలేదని బాధపడొద్దు.

నీట్ 2020లో ర్యాంకు సాధించలేక డిస్ క్వాలిఫై అయిన విద్యార్థులు మనస్తాపం చెందవద్దని, నిరాశపడవద్దని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్నారు. నీట్ ఫలితాలు వెల్లడైన తర్వాత ట్విటర్ లో స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చిన ఆయన.. ‘‘ఇతర రంగాల్లో అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఓ పరీక్ష మిమ్మల్ని, మీ జీవితాన్ని నిర్ణయించబోదు. దేశానికి మీ మేధాశక్తి, బుద్ధి కుశలత ఆ రంగాల్లో అవసరం'' అని విద్యార్థులకు ధైర్యం నూరిపోశారు. ప్రధాని మోదీ విజన్ అయిన ఆత్మ నిర్భర్ భారత్‌కు కొత్త వైద్యులు మద్దతిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాలని, అవసరార్థులైన ప్రజలకు భవిష్యత్తులో సేవలందించాలని కోరారు. నీట్ 2020ని విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్‌టీఏకు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పోఖ్రియాల్ ధన్యవాదాలు తెలిపారు.

Recommended Video

Vijayawada Kanaka Durga Flyover Opened For Traffic బెజవాడ వాసులుకు ట్రాఫిక్ కష్టాల నుండి ఉపశమనం..!!

తహసీల్దార్ నాగరాజుది హత్యే: జైలులో ఖైదీల మధ్య ఆత్మహత్యా?: కుటుంబీకుల ఆరోపణ -సీబీఐతోతహసీల్దార్ నాగరాజుది హత్యే: జైలులో ఖైదీల మధ్య ఆత్మహత్యా?: కుటుంబీకుల ఆరోపణ -సీబీఐతో

English summary
NEET 2020 Toppers odisha's Shoaib Aftab, delhi's Akanksha Singh had created history of sorts, to become the first to score a perfect score. Soyeb and Akansha has scord 720 out of 720 marks in NEET 2020, but in tie breaker Soyeb gets 1st rank. several telugu states students also got place in top-10 ranks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X