వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

NEET 2020 ఫలితాల రద్దు కుదరదన్న సుప్రీం -ఆ విద్యార్థులకు ఓఎంఆర్ షీట్లు -ఎన్‌టీఏకు కోర్టు సూచన

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2020 పరీక్షలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పరీక్షలను తప్పుగా నిర్వహించారని ఆరోపిస్తూ, ఫలితాలను రద్దు చేయాలని కోరుతూ కొందరు విద్యార్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం కొట్టేసింది. అయితే.. విద్యార్థుల అభ్యంతరాను పరిగణిస్తున్నామన్న కోర్టు.. ఓఎంఆర్ షీట్లను పరిశీలించుకునే అవకాశం ఆ విద్యార్థులకు కల్పించే అంశంపై ఆలోచన చేయాలంటూ ఎన్‌టీఏకు సూచించింది.

ఏపీలో కరోనా విలయం: విషమంగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్యం -రెండోసారి కరోనా సోకడంతోఏపీలో కరోనా విలయం: విషమంగా టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోగ్యం -రెండోసారి కరోనా సోకడంతో

మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ 2020)' లోపభూయీష్టంగా సాగిందని, పరీక్ష నిర్వాహకులైన 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)' ఇటర్నెట్ లో అప్ లోడ్ చేసిన ఓఎంఆర్ షీటుకు.. దాంతోపాటే ఉంచిన ఆన్సర్ కీ(పరీక్షలో అడిగిన ప్రశ్నల జవాబులు)కు పొంతన లేదని, తప్పుల తడకగా నిర్వహించిన పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ 19 మంది విద్యార్థులు న్యాయపోరాటం చేస్తున్నారు. ఆర్టికల్ 32 ప్రకారం వారు దాఖలుచేసిన పిటిషన్ ను గురువారం సుప్రీంకోర్టు కొట్టేసింది.

NEET 2020: Supreme Court Directs NTA To Furnish Original OMR Sheets

విచారణ సందర్భంగా జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగీలతో కూడిన త్రిసభ్య ధర్మాసం కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్-2020 పరీక్షల ఫలితాలు ఇప్పటికే వెల్లడయ్యాయని, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా జరుగుతోందని, ఈ దశలో కొందరి అభ్యంతరాల మేరకు మొత్తం పరీక్షను, ఫలితాలను రద్దు చేయడం కుదరబోదని బెంచ్ స్పష్టం చేసింది. అయితే..

GHMC Elections 2020 Exit Poll Results -నాగన్న సర్వేలోనే టీఆర్ఎస్‌కు 100 -బండి సంజయ్ తుస్GHMC Elections 2020 Exit Poll Results -నాగన్న సర్వేలోనే టీఆర్ఎస్‌కు 100 -బండి సంజయ్ తుస్

ల్ 32 ప్రకారం కాకుండా, ఆర్టికల్ 226 కింద మరో రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అదే సమయంలో సదరు విద్యార్థులకు తమ ఓఎంఆర్ లను పరిశీలించుకునే అవకాశాన్ని కల్పించే దిశగా ఆలోచించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ను కోర్టు కోరింది. దీనిపై ఎన్‌టీఏ తన స్పందన తెలియజేయాల్సి ఉంది.

English summary
The Supreme Court, on Thursday, while refusing to entertain a writ petition filed by some aspirants for admission for undergraduate medical courses seeking quashing of the NEET 2020 results, directed the National Testing Agency (NTA) to consider representation preferred by them for furnishing the original OMR sheets. Nineteen candidates had approached the Court by filing a writ petition under Article 32 contending that the OMR sheets uploaded by the NTA do not tally with the actual answers given by them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X