NEET 2020: నిబంధనల సవరణ - కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గైడ్ లైన్స్ ఇవే..
మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటీ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) - 2020కి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ నియమ నిబంధనలను సవరించింది. పరీక్ష సమయంలో అభ్యర్థులు, నిర్వాహకులు అనుసరించాల్సిన విధివిధానాలను ఇదివరకే ప్రకటించిన కేంద్రం.. గురువారం సవరించిన గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఈనెల 13న జరుగనున్న నీట్ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో పరీక్ష యధావిధిగా కొనసాగనుంది.

నీట్ పరీక్షకు సవరించిన నిబంధనలు ఇవే..
1. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఉండవు. నాన్ కంటైన్మెంట్ జోన్లలోని కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు.
2. కంటైన్మెంట్ జోన్లలో నివసిస్తోన్న సిబ్బందిని ఎగ్జామినర్లుగా అనుమతించరు.
3. కంటైన్మెంట్ జోన్లలో నివసిస్తోన్న సిబ్బందిని నేరుగా పరీక్ష కేంద్రాల్లో కాకుండా, ఇతర పనులకు వాడుకునే అవకాశాన్ని ఆయా విద్యా సంస్థలు లేదా ఏజెన్సీలకు అవకాశం కల్పించారు.
4. పేపర్, పెన్ను వాడుతూ రాసే పరీక్ష కావడంతో నీట్-2020 క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ షీట్లను విద్యార్థులకు పంపిణీ చేయడానికి ముందు ఇన్విజిలేటర్లు తప్పనిసరిగా చేతుల్నిశానిటైజర్ తో శుభ్రపర్చుకోవాలి.
5. పరీక్షకు ముందు కూడా ఆయా పత్రాలను శానిటైజ్ చేసి ఇన్విజిలేటర్లకు అప్పగిస్తారు.
6. ఆన్సర్ షీట్ల సేకరణ, ప్యాకింగ్.. ఇలా ప్రతి దశలోనూ సిబ్బంది తమ చేతుల్ని శానిటైజర్ తో శుభ్రపర్చుకోవాలి.
7. విద్యార్థులు రాసిన ఆన్సర్ షీట్లు సేకరించిన తర్వాత 72 గంటల గడువు తర్వాతే వాటిని తెరవాల్సి ఉంటుంది.
8. ఎగ్జామ్ హాల్ లోగానీ, ఇతర సందర్భాల్లోగానీ పేపర్లను పంచేటప్పుడు లేదా లెక్కించేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉమ్మి లేదా లాలాజలాన్ని వాడరాదు.
9. పరీక్షా కేంద్రాల్లోకి వ్యక్తిగత వస్తువులు లేదా స్టేషనరీలను అనుమతించరు.
10. ఆన్లైన్ లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్షల కోసం, పరీక్షలు నిర్వహించడానికి ముందు, పరీక్ష తరువాత శానిటైజేషన్ తప్పనిసరి.
చైనాకు చెక్: భారత్-జపాన్ మధ్య కీలక సైనిక ఒప్పందం - ‘ఇండో-పసిఫిక్'లో డ్రాగన్ ఆటకట్టించేలా..

పరీక్షా కేంద్రంలో ఎవరైనా వ్యాధికి లోనైతే..
పరీక్ష రాసే సమయంలో అభ్యర్థులుగానీ, సిబ్బందిగానీ కోవిడ్ -19 లక్షణాలతో బాధపడితే వాళ్లను వెంటనే ఐసోలేషన్ రూమ్ కు పంపాలి. లక్షణాల తీవ్రతను బట్టి అందుబాటులో ఉన్న ఆరోగ్య సిబ్బంది సహాయం తీసుకోవాలి. వైద్యుల సూచన మేరకు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని సవరించిన నిబంధనల్లో కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్: సీరం సంచలన నిర్ణయం-భారత్లో క్లినికల్ ట్రయల్స్ నిలిపివేత -డీసీజీఐ నోటీసులతో

ఇవి కూడా తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే..
సెప్టెంబర్ 13న జరుగనున్న నీట్ పరీక్షకు సంబంధించి సవరించిన గైడ్ లైన్లతోపాటు గతంలో జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ కింది నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది..
1. పరీక్ష హాలులో ప్రతి విద్యార్థి మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలి. మాస్కులు, ఫేస్ కవర్లు ధరించాలి. తరచూ శానిలైజర్ తో చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. పరీక్షా కేంద్రం ఆవరణలో ఉమ్మివేయడం నిషేధం. ధిక్కరిస్తే చర్యలు తప్పవు.
2. పరీక్షా హాలు లోపల ఉన్న అన్ని ప్రదేశాలను తరచుగా శానిటైజ్ చేయాలి. ప్రధానంగా విద్యార్థులు తాకిన ప్రదేశాలను విధిగా శుభ్రం చేయాలి.
3. వృద్ధులు, గర్భవతులైన సిబ్బందికి ఇన్విజిలేషన్ డ్యూటీలు ఇవ్వరాదు. అయితే, విద్యార్థులతో ప్రత్యక్షంగా సంబంధం ఉండని ఇతర పనులకు వారిని వాడుకోవచ్చు.
4. పరీక్షా కేంద్రం లోపల సీటింగ్ విషయంలోనేకాదు, నిరంతరం సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి.
5. ఒకవేళ రవాణా ఏర్పాట్లు చేసిఉంటే, ఆయా వాహనాలను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి.
6. అన్ని ఎగ్జామ్ సెంటర్లలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాత మాత్రమే అభ్యర్థులు, సిబ్బందిని కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఒకవేళ ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తితే వారిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి పంపించి, ఇతర మార్గాల ద్వారా పరీక్ష రాసే అవకాశాల్ని కల్పిస్తారు.