వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నీట్' అభ్యర్థులకు డ్రెస్ కోడ్: ఏ దుస్తులు ధరించాలో సీబీఎస్ఈ ఆదేశాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు డ్రెస్ కోడ్‌ను సీబీఎస్ఈ ప్రకటించింది. మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్షలకు సంబంధించిన అడ్మిషన్ కార్డులను సీబీఎస్ఈ జారీ చేసింది.

నీట్‌కు హాజరయ్యే విద్యార్థులు తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని చెప్పింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తేలికపాటి రంగులున్న హాఫ్ చేతుల దుస్తులు మాత్రమే ధరించాలని పేర్కొంది. షూ ధరించరాదని చెప్పింది. ఒకవేళ వారు తమకు ఇష్టమైన దుస్తులు ధరించాలంటే మాత్రం పరీక్ష కేంద్రానికి గంట ముందు చేరుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

NEET exam: CBSE issues dress code

సీబీఎస్ఈ తాజా ఆదేశాల ప్రకారం అభ్యర్థులు తేలికపాటి దుస్తులు ధరించాలని, వాటికి పెద్దపెద్ద గుండీలు, బ్యాడ్జీలు, పువ్వులు తదితరాలు ఉండకూడదని, అలాగే అతి తక్కువ ఎత్తున చెప్పులు మాత్రమే ధరించాలని, బూట్లు వేసుకోకూడదని, మే 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుందని చెప్పింది. ఆ రోజు ప్రభుత్వ సెలవు దినమైనా తేదీలో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.

విద్యార్థులు వెంట తీసుకొచ్చే వస్తువులను భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదని, కాబట్టి మొబైల్స్ సహా ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని చెప్పింది. అలాగే, జామెట్రీ/పెన్సిల్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్, బెల్ట్, క్యాప్, వాచ్, మెటాలిక్ వస్తువులను అనుమతించబోమని పేర్కొంది.

English summary
The CBSE has released detailed guidelines for NEET 2018. The Board has asked students to come in light clothes with half sleeves worn with salwar/ trouser. The dress code rule also prohibits students from wearing anything with big buttons, brooch/badge, flower etc. Students should be wearing only slippers or sandals with low heels and not shoes. Girls should not wear any close toed footwear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X