• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

NEET: మిమ్మల్ని వేడుకుంటున్నా-దయచేసి ఆత్మహత్యలు వద్దు-విద్యార్థులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి

|

తమిళనాడులో 'నీట్' ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకై నిర్వహించే నీట్ పరీక్షలో అర్హత సాధిస్తామో లేదోనన్న ఆందోళనతో విద్యార్తులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గడిచిన వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

JusticeForChaithra: దారుణ హత్యకు గురైన 6 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ (ఫొటోస్)JusticeForChaithra: దారుణ హత్యకు గురైన 6 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ (ఫొటోస్)

'నేను మిమ్మల్ని వేడుకుంటున్నా.దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు.మీకు అసాధ్యమైనదేదీ లేదు.ఆత్మవిశ్వాసంతో చదవండి.తల్లిదండ్రులు కూడా పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించండి.వారిని ఎక్కువ ఒత్తిడికి గురిచేయకండి.విద్యార్థులకు ఉన్న కొద్ది అవకాశాన్ని కూడా నీట్ లేకుండా చేసింది.కేంద్ర ప్రభుత్వం కఠిన హృదయంతో వ్యవహరిస్తోంది.మెట్టు దిగేందుకు కేంద్రం సిద్ధంగా లేదు.నీట్‌ను రద్దు చేసే పరిస్థితిని మేము తీసుకొస్తాం.' అని స్టాలిన్ పేర్కొన్నారు.

neet issue cm mk stalin appeals students not to commit suicide

ఈ నెల 12న నీట్‌ పరీక్ష రాసిన 17 ఏళ్ల సౌందర్య అనే విద్యార్థిని బుధవారం(సెప్టెంబర్ 15) ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్షలో అర్హత సాధిస్తానో లేదో అన్న భయంతో ఆత్మహత్య చేసుకుంది. ప్రశ్నా పత్రం కఠినంగా ఉన్నదని, తాను బాగా రాయలేదని నీట్‌ అనంతరం సౌందర్య తన తల్లిదండ్రులతో చెప్పింది. అప్పటినుంచి మనస్తాపంగా ఉంటున్న బాలిక బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి ఒడిగట్టింది.

మంగళవారం (సెప్టెంబర్ 14) కనిమొళి అనే విద్యార్థిని కూడా నీట్‌లో అర్హత సాధించలేనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నది. ఆదివారం,నీట్‌ పరీక్షకు కొన్ని గంటల ముందు సేలం సమీపంలోని మెట్టూరులో 19 ఏళ్ల ధనుష్‌ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్‌కు రెండు సార్లు హాజరైనా అర్హత సాధించలేకపోయిన అతను... తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్నేళ్లలో దాదాపు 15 మంది తమిళనాడు విద్యార్థులు నీట్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు.

Hansika Motwani: సన్యాసులను సైతం నిద్ర పోకుండా చేస్తున్న హాట్ బ్యూటీ.. బికినీతో అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ...(ఫొటోస్)Hansika Motwani: సన్యాసులను సైతం నిద్ర పోకుండా చేస్తున్న హాట్ బ్యూటీ.. బికినీతో అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ...(ఫొటోస్)

నీట్‌ను రద్దుపై తీర్మానం చేసిన తమిళనాడు ప్రభుత్వం :

తమిళనాడులో నీట్ పరీక్ష రద్దుపై ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.బిల్లును తమిళనాడు శాసన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడితేనే చట్టరూపం దాల్చుతుంది.నీట్‌కు బదులు 12వ తరగతి మార్కుల ప్రాతిపదికనే మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది.

గత యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను ప్రవేశపెట్టారు. అప్పుడు డీఎంకె కూడా యూపీఏలో భాగస్వామిగా ఉంది. అయితే అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి కేంద్రంతో మాట్లాడి తమిళనాడును నీట్ నుంచి మినహాయించేలా చేశారు. తమిళనాడు ప్రతిపాదనకు అప్పట్లో రాష్ట్రపతి ఆమోదం లభించింది. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటంతో తమిళనాడు ప్రభుత్వానికి నీట్ నుంచి మినహాయింపు పొందడం అంత సులువుగా సాధ్యపడకపోవచ్చు.

నీట్‌తో ఎదురయ్యే సామాజిక, ఆర్థిక ప్రభావాలను అధ్యయనం చేసేందుకు గతంలో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నీట్ ఆధారంగా మెడికల్ కాలేజీలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు.. 12వ తరగతి మార్కుల ఆధారంగా అడ్మిషన్లు పొందిన వారికంటే గొప్పగా ఏమీ రాణించడం లేదని అందులో తేలింది. ధనిక విద్యార్థులు మాత్రమే నీట్‌లో అధిక స్కోరు సాధించగలిగారని కమిటీ రిపోర్ట్ వెల్లడించింది.ఈ నేపథ్యంలోనే నీట్ రద్దుకు తమిళనాడు ప్రభుత్వం పట్టుబడుతోంది.

English summary
'Neat' suicides in Tamil Nadu are alarming. Students are committing suicide with the fear of whether they will qualify for the NEET exam conducted for admissions in medical colleges. Three students have committed suicide in the past week. In this context, Chief Minister MK Stalin appealed to students not to commit suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X