వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఎఫెక్ట్: NEET, JEE వాయిదా.. సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తాం: HRD మంత్రి పోఖ్రియాల్

|
Google Oneindia TeluguNews

కరోనా విలయం కారణంగా కీలకమైన మరో రెండు ఎంట్రెన్స్ పరీక్షలూ వాయిదా పడ్డాయి. ఈ నెల 18 నుంచి 23 వరకు జరగాల్సిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌(JEE ) మెయిన్స్‌, ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (IIT) ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. అలాగే, ఈ నెల 26 న జరగాల్సిన నేషనల్‌ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌(NEET ) కూడా వాయిదా పడింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు.

NEET, JEE Main Exam 2020 postponed till September, says HRD Min

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకునే పరీక్షలను వాయిదా వేశామని మంత్రి తెలిపారు. ఇప్పుడు వాయిదా పడ్డ ఈ మూడు పరీక్షలను సెప్టెంబర్‌ లో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు, నీట్ పరీక్ష సెప్టెంబర్ 13న, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష సెప్టెంబర్ 27న నిర్వహిస్తామని తెలిపారు.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ స్కూళ్లు, కాలేజీ భవంతులను క్వారంటైన్ సెంటర్లుగా వాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతోనే కేంద్రం వాయిదా నిర్ణయాన్ని తీసుకుంది. పాజిటివ్ కేసుల విషయానికొస్తే.. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 20,903 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6.38లక్షలకు, మరణాల సంఖ్య 18,400కు పెరిగింది.

English summary
The HRD Ministry postponed the JEE Main, NEET, and JEE Advanced entrance exams again due to the coronavirus pandemic. Exams now in September. Keeping in mind the safety of students and to ensure quality education we have decided to postpone says HRD Minister Ramesh Pokhriyal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X