వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీట్ పీజీ 2021 వాయిదా: కేంద్రం మరో కీలక నిర్ణయం, త్వరలో కొత్త తేదీ ప్రకటన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రాన్స్ టెస్ట్ ఫర్ పోస్టు గ్రాడ్యూయేట్ స్టూడెంట్స్(నీట్ పీజీ 2021)ను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ గురువారం వెల్లడించారు.

యువ వైద్య విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఎంఎస్, ఎండి కోర్సుల్లో ప్రవేశం కోరుకునే వైద్యులకు నీట్ పిజి పరీక్ష. కాగా, ఇంతకుముందు జనవరిలో పరీక్ష జరగాల్సి ఉంది కానీ, మహమ్మారి కారణంగానే వాయిదా పడింది.

 NEET PG 2021 postponed amid Coronavirus spike, new date will be announced later

ఏప్రిల్ 18న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షలు వాయిదా వేసిన కేంద్ర ప్రభుత్వం.. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. కాగా, కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించక ముందే పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ గురువారం వైద్యుల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పరీక్షలో హాజరయ్యే అభ్యర్థులు రోజూ కోవిడ్ -19 రోగులకు చికిత్స చేస్తున్నారని వైద్యులు తమ అభ్యర్ధనలో తెలిపారు.

ఈ పరీక్షకు హాజరైతే వేలాది మంది జీవితాలకు ప్రమాదకరమని పిటిషన్లో పేర్కొన్నారు. అందువల్ల నీట్ పీజీ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే నీట్ పీజీ 2021ని వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇటీవల సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. మే 4 నుంచి జరగాల్సిన 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఈ పిటిషన్లో ప్రస్తావించారు.

English summary
The National Eligibility cum Entrance test for post graduate students, scheduled to be held on April 18, has been postponed for the time being, in view of the rising Covid-19 cases, Union health minister Dr Harsh Vardhan said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X