వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

NEET result 2020: అభ్యర్థుల్లో నెలకొన్న ఉత్కంఠ.... ఫలితాలు ఎలా ఎక్కడ చూడాలి..?

|
Google Oneindia TeluguNews

నీట్ ఫలితాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ఈ రోజు ఫలితాలను విడుదల చేసేందుకు NTA సిద్ధమైంది. వాస్తవానికి 12వతేదీన ఫలితాలు విడుదల కావాల్సివుండగా కోవిడ్ కారణంగా కొంతమంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేక పోయారు. ఈ క్రమంలోనే సుప్రీమ్ కోర్టు జోక్యం చేసుకుని ఆ విద్యార్థుల ఫలితాలను కలిపి అక్టోబర్ 16న విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Recommended Video

NEET Result 2020 : ఫలితాలు ఎలా ఎక్కడ చూడాలంటే! || Oneindia Telugu

మరి కాసేపట్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ 2020) ఫలితాలు విడుదల కానున్నాయి. ఆన్‌లైన్ ద్వారా ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. నీట్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌పై ntaneet.nic.in పొందుపర్చనుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నీట్ ఫలితాలను తెలుసుకునేందుకు అభ్యర్థులు పైన ఇచ్చిన వెబ్‌సైట్‌కు లాగిన్ అయి వారి రిజిస్ట్రేషన్ లేదా రోల్ నెంబర్‌‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేస్తే చాలు. అభ్యర్థుల ఫలితాలు వస్తాయి. ఇక ఈ ఫలితాలతో పాటు నీట్ -2020 జవాబు పత్రంకు సంబంధించి ఫైనల్ "కీ"ను కూడా విడుదల చేయడం జరుగుతుంది. అన్ని సెట్లకు సంబంధించి అంటే (E1- E6, F1- F6, G1-G6, H1-H6)ఫైనల్ కీ ని విడుదల చేయనున్నారు అధికారులు.

నీట్ ఫలితాలు 2020 హైలైట్స్

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ నీట్ పరీక్షను నిర్వహించింది

పరీక్ష పేరు: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ 2020)

నీట్ 2020 పరీక్ష ఫలితాలు తేదీ : అక్టోబర్ 16

ఫలితాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు తమ రోల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది

NEET result 2020: Date, Time, Answer Key to be announced today

ఇక నీట్ ర్యాంక్ లిస్టు 2020తో పాటు నీట్ ఫలితాలను విడుదల చేయడం జరుగుతుంది. ఆలిండియా స్థాయిలో 15శాతం కోటాకు సంబంధించిన నీట్-2020 ర్యాంకులు విడుదల చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలిన 85శాతం కోటాకు సంబంధించిన నీట్ ర్యాంకులను ఆయా రాష్ట్ర కౌన్సిలింగ్ సంస్థలకు ఎన్‌టీఏ పంపుతుంది.

నీట్ 2020 పరీక్ష సెప్టెంబర్ 13న ఎన్‌టీఏ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 542 మెడికల్ కాలేజీల్లోని 80,005 ఎంబీబీఎస్‌ సీట్ల అడ్మిషన్‌ కోసం అభ్యర్థులు పోటీపడ్డారు. ఇక 313 కాలేజీల్లో 26,949 బీడీఎస్ సీట్లు ఉండగా, 914 కాలేజీల్లో 52,720 ఆయుష్ సీట్లు ఉన్నాయి.ఈ సారి నీట్ కౌన్సిలింగ్‌లో 1205 ఎయిమ్స్ ఎంబీబీఎస్ సీట్లు, 200 జిప్‌మర్ ఎంబీబీఎస్ సీట్లను కూడా చేర్చడం జరిగింది. మొత్తానికి 13 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు.

English summary
The National Testing Agency (NTA) would be announcing the National Eligibility cum Entrance Test (NEET) Result 2020 and the final answer on Monday (October 12) at ntaneet.ac.in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X