వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

NEET result 2020: నీట్ ఫలితాలు విడుదల.. ఎలా ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..!

|
Google Oneindia TeluguNews

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ 2020) ఫలితాలు విడుదల అయ్యాయి. ఆన్‌లైన్ ద్వారా ఈ ఫలితాలు విడుదల అయ్యాయి. నీట్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌పై ntaneet.nic.in పొందుపర్చింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నీట్ ఫలితాలను తెలుసుకునేందుకు అభ్యర్థులు పైన ఇచ్చిన వెబ్‌సైట్‌కు లాగిన్ అయి వారి రిజిస్ట్రేషన్ లేదా రోల్ నెంబర్‌‌తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేస్తే చాలు. అభ్యర్థుల ఫలితాలు వస్తాయి. ఇక ఈ ఫలితాలతో పాటు నీట్ -2020 జవాబు పత్రంకు సంబంధించి ఫైనల్ "కీ"ను కూడా విడుదల చేసింది. అన్ని సెట్లకు సంబంధించి అంటే (E1- E6, F1- F6, G1-G6, H1-H6)ఫైనల్ కీ ని విడుదల చేశారు

నీట్ ఫలితాలు 2020 హైలైట్స్

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ నీట్ పరీక్షను నిర్వహించింది

పరీక్ష పేరు: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ 2020)

నీట్ 2020 పరీక్ష ఫలితాలు తేదీ : అక్టోబర్ 16

ఫలితాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు తమ రోల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది

NEET result 2020:NEET UG Result released, Here is how to check the result

ఇక నీట్ ర్యాంక్ లిస్టు 2020తో పాటు నీట్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది.ఆలిండియా స్థాయిలో 15శాతం కోటాకు సంబంధించిన నీట్-2020 ర్యాంకులు విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన 85శాతం కోటాకు సంబంధించిన నీట్ ర్యాంకులను ఆయా రాష్ట్ర కౌన్సిలింగ్ సంస్థలకు ఎన్‌టీఏ పంపుతుంది.

Recommended Video

Top News Of The Day : Nobel Prize 2020, ఆర్థిక శాస్త్రంలో ఇద్దరిని వరించిన నోబెల్ పురస్కారం!

నీట్ 2020 పరీక్షను సెప్టెంబర్ 13న ఎన్‌టీఏ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 542 మెడికల్ కాలేజీల్లోని 80,005 ఎంబీబీఎస్‌ సీట్ల అడ్మిషన్‌ కోసం అభ్యర్థులు పోటీపడ్డారు. ఇక 313 కాలేజీల్లో 26,949 బీడీఎస్ సీట్లు ఉండగా, 914 కాలేజీల్లో 52,720 ఆయుష్ సీట్లు ఉన్నాయి.ఈ సారి నీట్ కౌన్సిలింగ్‌లో 1205 ఎయిమ్స్ ఎంబీబీఎస్ సీట్లు, 200 జిప్‌మర్ ఎంబీబీఎస్ సీట్లను కూడా చేర్చడం జరిగింది. మొత్తానికి 13 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు.

English summary
NTA has declared NEET 2020 result at ntaneet.nic.in at 4.24 pm. The direct NEET result download link is given here .Results can be checked at ntaneet.ac.in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X