వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌ న్యూస్: ఇక పై 24 గంటలు అందుబాటులో ఆ సేవలు

|
Google Oneindia TeluguNews

ముంబై: నెట్ బ్యాంకింగ్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు పరిమిత సమయం వరకు ఉండే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) డిసెంబర్ 16 నుంచి ఏడు రోజుల పాటు 24 గంటలు అందుబాటులో ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 15 రాత్రి తర్వాత తెల్లారితే అంటే డిసెంబర్ 16 నుంచి NEFT సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. అయితే తొలి లావాదేవీలు మాత్రం అర్థరాత్రి 12:30 గంటలకు జరుగుతుందని చెప్పింది.

ఇదిలా ఉంటే సేవింగ్స్ ఖాతాలు కలిగి ఉన్నవారు NEFT వినియోగించి లావాదేవీలు జరిపితే ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని ఇప్పటికే బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది. అది కూడా జనవరి 2020 నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయబడవని ఆర్బీఐ స్పష్టం చేసింది. అసలు NEFT అంటే ఏమిటి? NEFT అనగా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్. ఈ పద్ధతి ద్వారా బదిలీ అయ్యే డబ్బులు లబ్ధిదారుడి ఖాతాకు చేరేందుకు రెండు గంటల సమయం పడుతుంది. ఇది మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, లేదా బ్రాంచ్‌కు వెళ్లి లావాదేవీలు చేయొచ్చు. ఒకవేళ ఖాతాదారుడికి బ్యాంకు పాస్ పుస్తకం లేకుంటే ఏదైనా NEFT సదుపాయం ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. ఒక లావాదేవీలో గరిష్టంగా రూ.50వేలు నగదు బదిలీ చేయొచ్చు. అయితే అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు NEFT ద్వారా బదిలీ చేయాలంటే ఎలాంటి పరిమితి లేదు.

 NEFT to be available 24 hrs on all days from December 16th:RBI

ఇక ఆర్బీఐ పరిధిలోకి వచ్చే ఆయా బ్యాంకులకు కొన్ని సూచనలు చేసింది ఆర్బీఐ. ప్రతి 48 గంటలకు ఒక బ్యాచ్ లావాదేవీలు జరుగుతాయని పేర్కొంది. అర్థరాత్రి 12:30 గంటలకు తొలి బ్యాచ్ సెటిల్‌మెంట్ జరుగుతుందని వెల్లడించింది . ఇలా తిరిగి మళ్లీ అర్థరాత్రి 12 గంటలకు లావదేవీలు ముగుస్తాయని పేర్కొంది. ఇక NEFT విధానం అన్ని రోజులు అందుబాటులో ఉంటుందని బ్యాంకు సెలవుదినాల్లో కూడా ఈ వ్యవస్థ పనిచేస్తుందని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.బ్యాంకు సమయం ముగిసిన తర్వాత జరిగే లావాదేవీలు స్ట్రెయిట్ త్రూ ప్రాసెసింగ్ విధానం ద్వారా జరుగుతాయని ఆర్బీఐ పేర్కొంది. NEFT ద్వారా జరిగిన లావాదేవీలకు సంబంధించి ఒక కన్ఫర్మేషన్ మెసేజ్‌వస్తుందని ఆర్బీఐ వెల్లడించింది.

ఇక సూచనలను పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టం యాక్ట్ 2007లోని సెక్షన్ 10(2) కింద చేర్చడం జరిగిందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ పరిధి కిందకు వచ్చే బ్యాంకులన్నీ NEFT లావాదేవీల కోసం సరిపడా డబ్బులను ఆర్బీఐ వద్ద ఉంచాలని ఆదేశించింది. ఇక ఆయా బ్యాంకులు తమ కస్టమర్లకు NEFT విధానంపై అవగాహన కల్పించాలని రిజర్వ్ బ్యాంక్ కోరింది.

English summary
RBI announced that it has decided to make the National Electronic Funds Transfer (NEFT) system available on a 24x7 basis from December 16
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X