వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్యుల నిర్లక్ష్యం : ఎడమ చేయి విరిగితే...కుడి చేతికి కట్టు కట్టిన వైద్యులు...

|
Google Oneindia TeluguNews

ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా... ప్రభుత్వ డాక్టర్లు మాత్రం తమ నిర్లక్ష్యం వీడడడం లేదు...గాయం ఓ దగ్గర అయితే మందు ఇంకో దగ్గర పెట్టినట్టు ఉంటుంది ప్రభుత్వ డాక్టర్ల తీరు... ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వైద్యులు మాత్రం రోగుల పట్ల నిర్లక్ష్యం కొనసాగిస్తూనే ఉన్నారు... తాజాగా బీహార్‌లో వైద్యులు చేసిన సంఘటన రాష్ట్ర్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.ఓ బాలుడికి ఎడమ చేయి విరిగిపోతే కుడి చేయికి కట్టు కట్టిన వైనం వెలుగు చూసింది.

బీహార్‌లోని లహరీయా సరాయి ప్రాంతానికి చెందిన ఫయాజన్ అనే బాలుడికి గాయం కావడంతో ఆయన ఎడమ చేతి విరిగి పోయింది. దీంతో ధర్భంగా మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లాడు..దీంతో ఆసుపత్రి డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్వవహరించారు..బాలుడిని పరీక్షించిన వైద్యులు ఎడమ చేయి విరిగి పోయిందని నిర్ధారించారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా...కుడి చేతికి సిమెంట్ పట్టి వేశారు. దీంతో బాలుడి తల్లి డాక్టర్ల నిర్లక్ష్యంపై మండిపడింది..బాలుడిని పరీక్షించిన వైద్యులు కనీసం మెడిసిన్ కూడ ఇవ్వలేదని వాపోయింది. దీనిపై విచారణ జరిపించాలని ఆమే డిమాండ్ చేసింది.

Negligence : Plaster Right Hand of Child Who Suffered Fracture On Left Hand

ఇక జరిగిన సంఘటన విచారణ జరిపించాలని రాష్ట్ట్ర ఆరోగ్య మంత్రి ఆసుపత్రి సూపరిండెంట్‌ను ఆదేశించారు..దీంతో విచారణ కొనసాగుతున్నట్టు సూపరిండెంట్ డా. రాజ్ రంజన్ దాస్ తెలిపారు..సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.కాగా ఇప్పటికే మెదడు వాపు వ్యాధితో వందల మంది పసిపిల్లల ప్రాణాలు గాలిలో కలుస్తున్న విషయం తెలిసిందే...

English summary
Negligence on the part of hospital staff and doctors has resulted in the suffering of a minor boy. a boy, Faizan, in Bihar's Laheriasarai area had come to Darbhanga Medical College and Hospital (DMCH) for plaster in the left hand but due to utter carelessness, the plaster was conducted on the right hand
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X