వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఎస్ టీలో నాలుగేళ్ల ముందే పీహెచ్ డీ పూర్తి చేసిన లేడీ; ఆమె తండ్రి ఎవరంటే ? ఎలా !

ఎస్ టీ అమలులోకి వచ్చిన తరువాత దేశంలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. జీఎస్ టీని చాల మంది స్వాగతిస్తున్నారు, అలాగే వ్యతిరేకిస్తున్న వారు ఉన్నారు. అయితే జులై 1 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చిన జీఎస్ టీ వ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జీఎస్ టీ అమలులోకి వచ్చిన తరువాత దేశంలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. జీఎస్ టీని చాల మంది స్వాగతిస్తున్నారు, అలాగే వ్యతిరేకిస్తున్న వారు ఉన్నారు. అయితే జులై 1 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చిన జీఎస్ టీ విషయంలో ఇప్పటికీ దేశ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.

జీఎస్ టీ విషయంలో ఓ మహిళ నాలుగేళ్ల క్రితమే పీహెచ్ డీ పూర్తి చేశారని వెలుగు చూడటంతో చాల మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని బెతోల్ జిల్లాకు చెందిన నేహా ఉపాధ్యాయ నాలుగేళ్ల క్రితమే జీఎస్ టీ మీద పీహెచ్ డీ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

Neha Upadhya of Betul district in Madhya Pradesh done four years ago on GST.

నేహా ఉపాధ్యాయ సోదరి నిహితా ఉపాధ్యాయ మధ్యప్రదేశ్ లోని శాహాపూర్ పోలీసు విభాగంలో ఎస్ డీఓపీగా ఉద్యోగం చేస్తున్నారు. 2009లో అప్పటి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ (ప్రస్తుత భారత రాష్ట్రపతి) జీఎస్ టీ అమలులోకి తీసుకురవడానికి ప్రయత్నించారు.

జీఎస్ టీపై అధ్యయనం చేసి నివేదిక తయారు చెయ్యడానికి ఆరు మందితో ఓ ప్రత్యేక కమిటి ఏర్పాటు చేశారు. ఆ కమిటీలోని ఆరు మందిలో నేహా ఉపాధ్యాయ తండ్రి నర్మదా ప్రసాద్ ఉన్నారు. అప్పట్లో ఇండోర్ లోని ఆర్ట్స్ కాలేజ్ లో నేహా ఉపాధ్యాయ విద్యాభ్యాసం చేస్తున్నారు.

జీఎస్ టీ మీద పరిశోధన చేసిన నేహా ఉపాధ్యాయ 2013లో 334 పేజీల నివేదిక తయారు చేసి విశ్వవిధ్యాలయంతో పాటు తన సీనియర్ ప్రొఫెసర్లకు సమర్పించారు. 1954లో ఫ్రాన్స్ లో మొదటి సారి జీఎస్ టీ బిల్లు ప్రవేశ పెట్టారని, తరువాత తైవాన్, డెన్మార్క్, కెనడాతో పాటు ప్రపంచంలోని 150 దేశాల్లో జీఎస్ టీ అమలులోకి వచ్చిందని పరిశోధన చేసిన నేహా ఉపాధ్యాయ జీఎస్ టీపై పీహెచ్ డీ పూర్తి చేసి విశ్వవిధ్యాలయంలో నివేదిక సమర్పించారు.

English summary
Neha Upadhya of Betul district in Madhya Pradesh done four years ago on GST.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X