వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెహ్రూ నుంచి రాజీవ్ వరకు: సిక్కులను అణిచివేసేందుకు ప్రయత్నించింది కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: 1947లో దేశ విభజన జరిగిన సమయంలో పంజాబ్‌ను విడగొట్టడంలో దేశతొలి ప్రధాని నెహ్రూ హస్తం ఉందని మండిపడ్డారు కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్. పంజాబ్‌ను విడగొడితే రెండు కిలోమీటర్ల మేరా సరిహద్దును పొడిగించొచ్చనే నిర్ణయం నెహ్రూ చేశారని ఆమె ఆరోపించారు. ఇలా చేయడం వల్ల సిక్కులను అణిచివేయొచ్చనేదిగా నెహ్రూ ఆలోచన ఉండేదని ఆమె చెప్పారు. పంజాబ్‌ను నెహ్రూ విడగొడితే... ఇందిరాగాంధీ స్వర్ణదేవాలయంపై దాడి చేయించారని మండిపడ్డారు.

<strong>చైనాకు అమెరికా హెచ్చరిక: ఈసారి మసూద్‌కు మద్దతు ఇస్తే ఖబడ్దార్..!</strong>చైనాకు అమెరికా హెచ్చరిక: ఈసారి మసూద్‌కు మద్దతు ఇస్తే ఖబడ్దార్..!

ఇందిరాగాంధీ స్వర్ణదేవాలయంలోకి మిలటరీని పంపి అందులో ఉన్న సిక్కులను అణిచివేయాలని ఆదేశించారని హర్‌సిమ్రత్ కౌర్ అన్నారు. తండ్రి పంజాబ్‌ను విడగొడితే కూతురు సిక్కులపై కన్నెర్ర చేశారని మండిపడ్డారు. స్వర్ణదేవాలయంలో మృతి చెందిన సిక్కులకు కారణం ఇందిరాగాంధీనే అని మండిపడ్డారు హర్‌సిమ్రత్ కౌర్. ఇక ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ వచ్చి తన రాజకీయ స్థిరత్వం కోసం దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులను అణిచివేయడం జరిగిందని అన్నారు. ఇక ఇప్పుడు ఆయన కుమారుడు రాహుల్ గాంధీ పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారని హర్‌సిమ్రత్ కౌర్ ధ్వజమెత్తారు.

Nehru broke Punjab, Indira Gandhi attacked Golden Temple: Harsimrat Kaur Badal

1984 అల్లర్ల కేసులో ఇప్పుడిప్పుడే సిక్కులకు న్యాయం జరుగుతోందని అది కూడా ప్రధాని నరేంద్రమోడీ చొరవతోనే అది సాధ్యమవుతోందని హర్‌సిమ్రత్ కౌర్ కొనియాడారు. ఎట్టకేలకు తమకు న్యాయం జరుగుతోందని చెప్పిన కౌర్...కర్తాపూర్ సాహిబ్ కారిడార్ వస్తోందని చెప్పారు. ఇదంతా కేవలం ప్రధాని మోడీ చొరవ తీసుకోవడంతోనే జరుగుతోందన్నారు.అయితే దీన్ని కూడా కాంగ్రెస్ అడ్డుకోవాలని ప్రయత్నంచేస్తోందని మండిపడ్డారు. ఇందుకు కారణంగా ఉగ్రవాదం, చర్చలు అంశాలను కాంగ్రెస్ బూచిగా చూపించేందుకు సిద్ధమవుతోందని వెల్లడించారు.

English summary
Union Minister Harsimrat Kaur Badal on Wednesday said that Jawaharlal Nehru was responsible for the division of Punjab at the time of India's partition in 1947."If Punjab was divided, it was Jawaharlal Nehru's decision, that border could easily have been extended by two km," Harsimrat Kaur Badal said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X