వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ సమస్యకు నెహ్రూనే కారణం: అమిత్ షా

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూపై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం నెహ్రూ వల్లే కాశ్మీర్ సమస్య ఉత్పన్నమైందని ఆయన మండిపడ్డారు.

కాశ్మీర్ అంశాన్ని అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు అప్పగించి ఉంటే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేదే ఉండేది కాదని.. అన్నారు.

ఆర్టికల్ 360 ప్రస్తావనే వచ్చేది కాదని చెప్పారు. ఆ అంశాన్ని పటేల్‌కు ఇవ్వకుండా నెహ్రూ అతిపెద్ద చారిత్రక తప్పిదం చేశారని విమర్శించారు. ప్రస్తుత కాశ్మీర్ సమస్యకు నెహ్రూనే కారణమని అన్నారు.

భారత్-పాక్ మధ్య చర్చలకు తేదీ ఖరారు కాలేదు: విదేశాంగ శాఖ

భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలకు తేదీలు ఇంకా ఖరారు కాలేదని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ విషయంలో ఇప్పటివరకు పాక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల కాలేదన్నారు. అందుకే పాక్ అభిప్రాయం వెల్లడించాకే భారత్ నిర్ణయం తీసుకుంటుందని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

Nehru Created Kashmir Problem: Amit Shah At Book Launch

జులై నెలలో ఓ విదేశీ పర్యటనలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, ప్రధాని మోడీ కలుసుకున్నారు. అయితే ఇక్కడ ఇరు దేశాల మధ్య చర్చలు జరగవచ్చని అంతా భావించారు. కానీ పాక్ మాత్రం చర్చలు జరిపేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో చర్చలు జరగలేదు.

English summary
Bharatiya Janata Party president Amit shah on Thursday said that the former PM Jawaharlal Nehru Created the Kashmir Problem.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X