హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌పైకి పటేల్ ఆర్మీ: అద్వానీ సంచలన వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

LK Advani
న్యూఢిల్లీ: బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ మరోసారి వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు. స్వాతంత్ర్యానంతరం హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకోవడానికి సైన్యాన్ని పంపించాలని అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్ సూచించారని, దాంతో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పటే‌ల్‌ను పూర్తి స్థాయి మతతత్వవాదిగా అభివర్ణించారని అద్వానీ అన్నారు.

హైదరాబాద్‌పై పోలీసు యాక్షన్‌కు ముందు నెహ్రూ, పటేల్ మధ్య మంత్రివర్గ సమావేశంలో జరిగిన తీవ్ర వాగ్వివాదంపై ఎంకెకె నాయర్ నరాిసన ద స్టోరీ ఆఫ్ యన్ ఎరా టోల్డ్ వితౌట్ ఐ విల్ అనే పుస్తకంలోని కొన్ని విషయాలను ఉటంకిస్తూ అద్వానీ తన బ్లాగ్‌లో పోస్టు చేశారు. నిజాం పాకిస్తాన్‌ వైపు మగ్గు చూపాడని, పాకిస్తాన్‌కు దౌత్యవేత్తను పంపించాడని, అక్కడి ప్రభుత్వానికి భారీగా సొమ్ము కూడా పంపించాడని ఆయన అన్నారు. స్థానికులపై నిజాం అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయని ఆయన అన్నారు.

హైదరాబాద్ రాజ్యంలో తీవ్రవాద ప్రభుత్వాన్ని అంతం చేయడానికి సైన్యాన్ని పంపించాలని సర్దార్ పటేల్ అన్నారని, సాధారణంగా మౌనంగా, ప్రశాంతంగా, అంతర్జాతీయ దృక్పథంతో వ్యవహరించే నెహ్రూ కోపాన్ని అణచుకోలేకపోయారని, నువ్వు పూర్తిగా మతతత్వవాదివి, నీ సూచనను అంగీకరించను అని నెహ్రూ అన్నారని ఆయన అన్నారు.

నాయర్ గ్రంథంలోని విషయాలను ఉటంకిస్తూ సర్దార్ పటేల్ గది నుంచి వెళ్లిపోయారని ఆయన చెప్పారు. ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సర్దార్ పటేల్ వారసత్వాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న తరుణంలో అద్వానీ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

నెహ్రూ, పటేల్‌లను అప్పటి గవర్నర్ జనరల్ రాష్ట్రపతి భవన్‌కు పిలిచారని, ఈలోగానే హైదరాబాద్‌పై సైనిక దాడికి సర్వం సిద్ధమైందని అద్వానీ అన్నారు. రాజాజీ కూడా హైదరాబాద్‌పై సైనిక దాడికి మొగ్గు చూపినట్లు ఆయన తెలిపారు.

నెహ్రూ, పటేల్‌లతో సమావేశం సందర్భంగా రాజాజీ - రజాకార్లు 70 ఏళ్ల నన్స్‌పై అత్యాచారం చేసిన సంఘటనకు నిరసన వ్యక్తం చేస్తూ బ్రిటిష్ హైకమిషనర్ రాసిన లేఖను ట్రంప్ కార్డుగా వాడుకున్నారని ఆయన అన్నారు. సమావేశానికి ముందు సర్దార్ పటేల్‌ సన్నిహిత సహచరుడు, అధికారి అయిన విపి మీనన్ ఆ లేఖను రాజాజీకి అందజేసినట్లు ఆయన తెలిపారు.

రాజాజీ తనదైన శైలిలో హైదరాబాద్ పరిస్థితిని వివరించారని, భారత ప్రతిష్టను కాపాడాలంటే నిర్ణయంలో జాప్యం చేయకూడదని అభిప్రాయపడ్డారని చెప్పారు. నెహ్రూ అంతర్జాతీయ పరిణామాల గురించి ఆలోచిస్తుంటే, రాజాజీ బ్రిటిష్ హై కమిషనర్ లేఖను ట్రంప్ కార్డులా వాడారని అన్నారు. ఆ లేఖను నెహ్రూ చదివారని, నెహ్రూ ముఖం ఎర్రబడిందని, తన కుర్చీనుంచి కోపంగా లేచి నెహ్రూ బల్లపై పిడికిలితో గుద్ది ఒక్క క్షణం కూడా వృధా చేయవద్దు, వారికి గుణపాఠం చెప్దామని అన్నారని వివరించారు. రాజాజీ కమాండర్ ఇన్ చీఫ్‌కు సూచనలు ఇచ్చి, హైదరాబాద్‌పై సైనికి దాడికి పంపించారని అద్వానీ పుస్తకంలోని విషయాలను ఉటంకిస్తూ చెప్పారు.

English summary
BJP on Tuesday raked up another controversy over Sardar Patel with LK Advani quoting a book to allege that then Prime Minister Jawaharlal Nehru called his Home Minister a "total communalist" when the latter suggested that army be sent to take over a defiant Hyderabad after Independence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X