వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెహ్రూ బీజేపీ శత్రువు కాదు: కలెక్టర్‌ బదిలీపై కాంగ్రెస్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

భోపాల్: సోషల్ మీడియా మాధ్యమం ఫేస్‌బుక్‌ పోస్టులో భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూను ప్రశంసించినందుకు మధ్యప్రదేశ్‌లో ఓ ఐఏఎస్‌ అధికారి బదిలీ అయ్యారు. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ లోని బర్వానీలో కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అజయ్ సింగ్ గంగ్వార్ వారం రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశాడు.

అందులో జవహార్ లాల్ నెహ్రూని ప్రశంసించారు. పోస్ట్‌లో నెహ్రూ చేసిన తప్పేంటి? దేశాన్ని మతపరం కాకుండా కాపాడారు. నెహ్రూ సెక్యులర్ తత్వం, ఇస్రో, ఐఐటీ, బార్క్, ఐఐఎస్బీ, ఐఐఎం, బీహెచ్ఈఎల్, థర్మల్ ప్రాజెక్టులు, డ్యామ్ లు నెహ్రూ హయాంలో ఎన్నో నిర్మించారని అందులో పేర్కొన్నారు.

శాస్త్రవేత్తలైన విక్రమ్‌ సారాభాయ్‌, హోమిబాబాలను గౌరవించడం ఆయన తప్పు కావొచ్చు. వారు రాందేవ్‌, ఆశారాంల అంత మేధావులు కారని అందులో పేర్కొన్నారు. దీంతో అజయ్‌ సింగ్ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్ కావడంతో ఈ విషయం కేంద్రం దృష్టికి వెళ్లింది. ఇంకేముందు గురువారం ఆయనపై బదిలీ వేటు పడింది.

Nehru is not enemy of BJP: MP govt's decision to transfer IAS officer is just petty

ఆయనను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి కారణాన్ని వెల్లడించలేదు. గాంగ్వార్‌ గత ఆగస్టులో బద్వానీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది.

నెహ్రూ బీజేపీకి శత్రువు కాదని, ఆయన దేశానికి మాజీ ప్రధాని అంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై నిరసన చేపడాతమని హెచ్చరించింది. మరోవైపు ఈ ఫేస్‌బుక్ పోస్టుపై బీజేపీ నేత సారంగ్ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని, వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఈ పోస్ట్ ఉందని ఆయన ఆరోపించారు.

మరోవైపు రాజకీయ అంశాలపై అధికారులు కామెంట్లు చేయరాదన్న నియమాన్ని ఆయన ఉల్లంఘించారని తేల్చిన విచారణాధికారులు అజయ్ సింగ్‌పై బదిలీ వేటు వేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

English summary
IAS officer Ajay Singh Gangwar, who praised the country's first Prime Minister Pandit Jawaharlal Nehru in a Facebook post, was transferred by the Madhya Pradesh government on Thursday night. Gangwar was transferred as Deputy Secretary in the Secretariat in Bhopal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X