వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ అంశంలో నెహ్రూ తప్ప చేస్తే... ఇందిరా సరిదిద్దారు... మేము పరిష్కరించాం.. అమిత్ షా

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్ విలీనం అంశంపై మరోసారి కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా మాజీ ప్రధాని నేహ్రూపై తీవ్ర విమర్శలు చేశారు. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం కొరడంపై మండిపడ్డారు... కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఐరాస మద్దతు కోరారని అది ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు. కశ్మీర్ సమస్యపై ఎవ్వరితో కనీసం సంప్రదింపులు కూడ జరపలేదని తెలిపారు. ఈ సంధర్భంగా ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమని ఆయన విమర్శించారు. ఇది హిమాలయాల కంటే చాల పెద్దతప్పుని విమర్శించారు.

Nehru makes mistake bigger than himalayas in Kashmir issue : Amit Shah

స్వాతంత్ర్యం తర్వాత పటేల్ 630 సంస్థాలను దేశంలో విలీనం చేయగలిగితే, నెహ్రు ఒక్క కశ్మీర్‌ను విలీనం చేయలేక పోయాడని ఆరోపణలు చేశారు. అయితే నెహ్రు అప్పుడు చేయలేని పనిని ప్రస్తుతం బీజేపీ చేసి చూపించిందని అన్నారు. మరోవైపు స్వర్గీయ ప్రధాని ఇంధిరా గాంధిని ఆయన పొగిడారు. సిమ్లా ఒప్పందం ద్వార కశ్మీర్‌ను రెండు దేశాల ద్వైపాక్షిక అంశంగా చేశారని తెలిపారు.

కశ్మీర్‌లోని మొత్తం 196 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ ఎత్తివేసినట్టు చెప్పారు. కేవలం 8 పోలీస్ స్టేషన్ల పరిధిలోనే 144సెక్షన్ అమలుచేస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సమావేశంలో కూడ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని అన్ని దేశాల నేతలు సమర్థించారని చెప్పారు. ఏ ఒక్కరు కూడా భారత్ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేయలేదన్నారు. ఇది భారత ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన విజయం అని ఆయన పేర్కోన్నారు. మరోవైపు ఫోన్లను కట్ చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు రాదని చెప్పారు.

English summary
union Home Minister Amit Shah on Sunday once again blamed former Prime Minister Jawaharlal Nehru for the prolonged problems in Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X