వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వ అవకాశం వస్తే.. మేమెందుకు వద్దంటాం: నాటి ప్రధాని నెహ్రూ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనదేశానికి శాశ్వత సభ్యత్వం రాకుండా తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అడ్డుపడ్డారని అంటూ బీజేపీ నాయకులు చేస్తోన్న ఆరోపణల నేపథ్యంలో.. ఓ తాజా కథనం వెలుగులోకి వచ్చింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం తమకు ఎలాంటి సమాచారం గానీ, ఆహ్వానం గానీ అందలేదని అంటూ నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1955 సెప్టెంబర్ 28వ తేదీన లోక్ సభలో ఓ ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన ఓ కథనాన్ని ది హిందూ ప్రచురించింది. దీనికి సంబంధించిన ఓ క్లిప్పింగ్ ను దీనికి జోడించింది.

లోకేష్ టీం సిద్దం : వార‌సుల‌కు టిక్కెట్ల వెనుక : నాడే ప్ర‌ణాళిక‌..నేడు అమ‌లు: బాబు వ్యూహాత్మ‌కం..! లోకేష్ టీం సిద్దం : వార‌సుల‌కు టిక్కెట్ల వెనుక : నాడే ప్ర‌ణాళిక‌..నేడు అమ‌లు: బాబు వ్యూహాత్మ‌కం..!

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని పొందడానికి మన దేశానికి ఆహ్వానం అందినప్పటికీ.. ఈ అవకాశాన్ని నాటి నెహ్రూ ప్రభుత్వం జార విడుచుకుందని, తనకు బదులుగా చైనాకు శాశ్వత సభ్యత్వాన్ని కల్పించేలా లోపాయకారిగా వ్యవహరించిందంటూ విమర్శలు వస్తున్నాయి. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఇదే అంశంపై నాటి సభ్యుడు డాక్టర్ జెఎన్ పరేఖ్ అడిగిన ప్రశ్నకు నెహ్రూ బదులు ఇచ్చారు.

Nehru on permanent UNSC membership: ‘No question of a seat being offered and India declining it’

భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఐక్యరాజ్య సమితి తమను సంప్రదించలేదని, కనీస సమాచారాన్ని కూడా ఇవ్వలేదని నెహ్రూ సభలో వెల్లడించారు. ఉద్దేశపూరకంగానే తాము ఈ అవకాశాన్ని జారవిడుచుకున్నామని అంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను నెహ్రూ తోసిపుచ్చారు.

Nehru on permanent UNSC membership: ‘No question of a seat being offered and India declining it’

పత్రికల్లో వచ్చిన కథనాలు నిరాధారమైనవని చెప్పారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఏఏ దేశాలకు ఇవ్వాలనే విషయాన్ని ఐక్యరాజ్య సమితి నిర్ధారిస్తుందని, దాని ప్రకారమే కొన్ని దేశాలకు ఆ అవకాశం దక్కిందని నెహ్రూ పేర్కొన్నారు. తమ విదేశాంగ విధానం సైతం భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వాన్ని కోరుకుంటోందని, అలాంటి అవకాశం వస్తే తోసిపుచ్చబోమని నెహ్రూ చెప్పారు. దీనికి సంబంధించిన 1955 నాటి క్లిప్పింగ్ ను ది హిందూ ప్రచురించింది.

English summary
Prime Minister Nehru has categorically denied any offer, formal or informal, having been received about a seat for In dia in the UN Security Council. He made this statement in reply to a short notice question in the Lok Sabha on September 27 by Dr. J.N. Parekh whether India had refused a seat informally offered to her in the Security Council.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X