హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెహ్రూపై పటేల్ అసహనం: కాశ్మీర్‌పై అద్వానీ సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

L K Advani
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ మరో బాంబు పేల్చారు! స్వాతంత్ర్యానంతరం హైదరాబాద్‌ను భారత్‌లో విలీనం చేసుకోవడానికి సైన్యాన్ని పంపించాలని అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచించారని, దాంతో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పటే‌ల్‌ను పూర్తి స్థాయి మతతత్వవాదిగా అభివర్ణించారని అద్వానీ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా మరో సంచలనం రేపారు. 1948లో కాశ్మీర్‌కు సైన్యాన్ని పంపించేందుకు అప్పటి ప్రధాని నెహ్రూ తిరస్కరించారని తాజాగా తన బ్లాగులో పేర్కొన్నారు. సీనియర్ పాత్రికేయులు ప్రేమ్ శంకర్ ఝాకు అప్పటి కల్నల్ శాం మానెక్ షా ఇచ్చిన ఇంటర్వ్యూను ఉటంకిస్తూ అద్వానీ ఈ వ్యాఖ్యలు చేశారు.

గిరిజనుల మద్దతుతో పాకిస్తాన్ దళాలు శ్రీనగర్‌ను సమీపిస్తున్న తరుణంలో భారత్ బలగాలను తరలించే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో... నెహ్రూ తిరస్కరించారని, దీనిని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకు వెళ్లాలని భావించారని పేర్కొన్నారు. మహారాజా హరి సింగ్ విలీన ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత మౌంట్ బాటన్ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారని, అందులో నెహ్రూ, సర్దార్ పటేల్‌లు పాల్గొన్నారన్నారు.

మానెక్ షా అప్పటి మిలటరీ పరిస్థితిని వివరించి, భారత బలగాలను తరలించాలని సూచించగా, నెహ్రూ ససేమీరా అన్నారని, సహనం కోల్పోయిన పటేల్.. మీకు కాశ్మీక్ కావాలా లేదా దాన్ని వదిలేయాలనుకుంటున్నారా అని అడగ్గా, కాశ్మీర్ కావాలని నెహ్రూ జవాబిచ్చారని అయితే ఆదేశాలు ఇవ్వాలని పటేల్ కోరగా, ఆ తర్వాత తనకు ఆదేశాలిచ్చారని మానెక్ షా ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్లు అధ్వానీ పేర్కొన్నారు.

English summary
After claiming that Jawaharlal Nehru had called Sardar Patel a "total communalist", BJP leader L K Advani on Thursday stoked a fresh controversy saying the then prime minister was reluctant to send army to Kashmir in 1947 even as Pakistani troops approached, but the home minister prevailed over him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X