వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

SAARC : సార్క్ విదేశాంగ మంత్రుల వార్షిక సమావేశం రద్దు... పాకిస్తాన్ వల్లే...?

|
Google Oneindia TeluguNews

సార్క్( South Asian Association for Regional Cooperation-SAARC) విదేశాంగ మంత్రుల వార్షిక సమావేశం రద్దయింది.షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న వర్చువల్‌గా ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే సార్క్ సభ్య దేశాల మధ్య సమ్మతి కొరవడటంతో సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు నేపాల్ ప్రకటించింది. ఈ మేరకు నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

సార్క్ సమావేశం రద్దుకు పాకిస్తాన్ ప్రధాన కారణంగా తెలుస్తోంది.ఆఫ్గనిస్తాన్ తరుపున తాలిబన్ ప్రతినిధిని అనుమతించాలంటూ పాకిస్తాన్ పట్టుబట్టింది.అయితే ఇందుకు సభ్య దేశాలు అంగీకరించలేదు.దీంతో పాకిస్తాన్ మరో వాదనను ముందుకు తెచ్చింది.తాలిబన్లను అనుమతించనిపక్షంలో... గత ఆష్రఫ్ ఘనీ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని పట్టుబడింది.
పాకిస్తాన్ తీరుపై సభ్య దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి.ఈ పరిణామాల నేపథ్యంలో సార్క్ వార్షిక సమావేశం వాయిదా పడక తప్పలేదు.

nepal announces annual meet of saarc foreign ministers cancelled

సార్క్‌లో భారత్,బంగ్లాదేశ్,భూటాన్,నేపాల్,మాల్దీవులు,శ్రీలంక,పాకిస్తాన్,ఆఫ్గనిస్తాన్‌లు సభ్య దేశాలుగా ఉన్నాయి.నేపాల్‌లోని ఖాట్మండులో జనవరి 17,1987న సార్క్ సెక్రటేరియట్ ఏర్పాటైంది. సార్క్ ప్రాంతీయ కేంద్రాలు భారత్‌తో పాటు పాకిస్తాన్,మాల్దీవులు,భూటాన్,బంగ్లాదేశ్‌,శ్రీలంకల్లో ఉన్నాయి.సౌత్ ఏసియన్ దేశాల మధ్య పరస్పర సహకారం,ఆర్థిక వృద్ది,ప్రపంచశాంతి స్థాపనలో ఐక్యరాజ్యసమితికి దోహదపడటం,సభ్యదేశాల్లో ఉగ్రవాదాన్ని నిర్మూలించడం,దారిద్ర్యం, ఆకలి, నిరుద్యోగం, నిరక్షరాస్యత వంటి సామాజిక సమస్యలను తొలగించి, ప్రజాసంక్షేమ కార్యకలాపాలను చేపట్టడం,స్నేహపూర్వక వాతావరణం,దక్షిణాసియా దేశాల మధ్య ప్రాంతీయ సహకారానికి-సామాజిక ప్రగతికి సహకరించడం,తదితర అంశాల ప్రాతిపదికన సార్క్ ఏర్పడింది. గతేడాది నుంచి కోవిడ్ కారణంగా సార్క్ సమావేశాలు వర్చువల్‌గా జరుగుతూనే ఉన్నాయి.

English summary
The annual meeting of SAARC (South Asian Association for Regional Cooperation (SAARC) Foreign Ministers) has been cancelled.annual meet of saarc foreign ministers cancelled nepal announces
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X