వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్ భూకంపం మృత్యుఘోష: 668 మందికి పైగా మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

ఖాట్మండ్: నేపాల్ భారీ భూకంపం కుదిపిసేంది. 7.9 తీవ్రతతో తాకిన భూకంపానికి ఖాట్మండులో 668మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఖాట్మండు లోయలో దాని ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. సహాయం అందించాలని భారత్‌ను కోరినట్లు భారతదేశంలోని నేపాల్ రాయబారి దీప్ కె ఉపాధ్యాయ చెప్పారు.

ప్రధాని మోడీ నేపాల్ అధికారులతో మాట్లాడుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. భూకంపం కారణంతో ఖాట్మండ్ విమానాశ్రయాన్ని మూసేశారు. భూకంపం తర్వాత ఖాట్మండులోని ప్రధానమైన సివిల్ ఆస్పత్రికి 36 శవాలు వచ్చినట్లుగా చెబుతున్నారు.

Nepal earthquake: Over 150 dead in Kathmandu

అవసరమైతే సహాయక చర్యలకు దిగడానికి భారత వైమానిక దళాలు సిద్ధంగా ఉన్నాయి. భారత సైన్యాన్ని, బిఆర్ఓ, ఐఎఎఫ్‌‌లను రక్షణ శాఖ ఆవసరమైతే రంగంలోకి దిగడానికి సిద్ధం చేసింది.

భూకంపం తాకిడికి భారతదేశంలో 11 మంది మరణించారు. బీహారు రాష్ట్రంలో 9 మంది మరణించినట్లు 30 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు మరణించారు.

English summary
Over 150 dead in Kathmandu post 7.9 magnitude earthquake, Nepal's ministry of home affairs says
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X