వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

PM Master Plan: చైనా చెత్తబుద్ది, పాక్ వక్రబుద్ది, మోడీ ముందే పిల్లిగంతులు, ఓలి పదవికి ఎసరు, ఔరఔర!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ చైనా/ కాంఠ్మండు: చెన్నై చెత్త మాటలు, పాకిస్థాన్ పాడుమాటలు వింటున్న నేపాల్ ప్రధాని నక్క వినయం ప్రదర్శించడంతో మొదటికే మోసం వస్తోంది. నేపాల్ ప్రధాని కెపి. శర్మ ఓలి పొలిటికల్ గేమ్ తో సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా ? అంటే అవుననే అంటున్నారు ఆదేశ రాజకీయ ప్రముఖులు. భారత్ కు వ్యతిరేకంగా ఇండియా భూభాగం తమవని కొన్ని రోజులు సంకలు గుద్దుకున్న నేపాల్ ప్రధాని కెపి. శర్మ ఓలికు ఆయన పదవి ఊసిపోయే పరిస్థితి ఎదురైయ్యింది. భారత్ కు వ్యతిరేకంగా పావులు కదపడం, అందుకు చైనా, పాకిస్థాన్ వంత పాడటంతో నేపాల్ ప్రధాని కెపి. శర్మ ఓలి భారత ప్రధాని నరేంద్ర మోడీ ముందు పిల్లిగంతులు వేసి అడ్డంగా బుక్కైనాడు. సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షాలు సైతం ఇప్పుడు నేపాల్ ప్రధాని కెపి. శర్మ ఓలిని రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాయి.

Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్

 పోయే కాలం వచ్చింది

పోయే కాలం వచ్చింది

భారత్ తో ఇంతకాలం అన్యోన్యంగా ఉన్న నేపాల్ ఇప్పుడు సరిహద్దుల విషయంలో లేనిపోని రాద్దాంతం చేస్తోంది. భారత్ భూభాగంలోని భూమి (సరిహద్దులు) తమవిగా చెప్పకుంటూ పొలిటికల్ గేమ్ ఆడాలని ప్రయత్నించింది. నేపాల్ ప్రధాని కెపి. శర్మ ఓలి పొలికల్ మ్యాప్ మాస్టర్ ప్లాన్ ను ఆదేశ పార్లమెంట్ లో ఆమోదింపచేసుకుని అడ్డదారిలో విజయం సాధించి హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారు.

చైనా చెత్త మాటలకు తలఊపిన ఓలి

చైనా చెత్త మాటలకు తలఊపిన ఓలి

భారత్ భూభాగం విషయంలో రచ్చచేసిన నేపాలకు చైనా, దాయాది దేశం పాకిస్థాన్ వంతపాడింది. ఇప్పటికే లద్దాఖ్ లో లేనిపోని కుట్రలు చేస్తున్న చైనా ఎలాగైనా భారత్ కు చెమటలు పుట్టించాలని పక్కదారిలో ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో చైనా తనకు మద్దతు ఇస్తోందని నేపాల్ ప్రధాని కెపి. శర్మ ఓలి ఎగిరెగిరిపడ్డాడు. అయితే భారత్ తో పెట్టుకుంటే ఏమౌతుందో అనే విషయం ఓలి ఆలస్యంగా గ్రహించాడు.

 పనిపాట లేని పాక్ ప్రధాని ఇమ్రాన్

పనిపాట లేని పాక్ ప్రధాని ఇమ్రాన్

నేపాల్ కు చైనా మద్దతు పలకడంతో నేను ఉన్నాను అంటూ పాకిస్థాన్ పైకి లేచింది. ఇదే సమయంలో పనిపాటలేని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేను ఉన్నాను అంటూ నేపాల్ ప్రధాని కెపి. శర్మకు వంతపాడటం మొదలుపెట్టాడు. ఇలాంటి సమయంలో రెండు దేశాలు తనకు మద్దతు ఇస్తున్నాయని, ఇక నా ఆటలకు అడ్డుఅదుపులేదని నేపాల్ ప్రధాని కెపి. శర్మ ఓలి రెచ్చిపోయాడు.

భారత్ కుట్రలు చేస్తోంది

భారత్ కుట్రలు చేస్తోంది

తనను ప్రధాని పదవి నుంచి తప్పించడానికి, తమ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని నేపాల్ ప్రధాని కెపి. శర్మ ఓలి మూడు రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశారు. తమ తప్పు ఏమీ లేదని, కావాలనే నేపాల్ మీద భారత్ కుట్రలు పన్నుతోందని, మనం అందరం కలిసిపోరాటం చెయ్యాలని నేపాల్ ప్రధాని కెపి. శర్మ ఓలి సొంత పార్టీ నేతలతో పాటు నేపాల్ లోని అన్ని రాజకీయ పార్టీలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు.

మొదటికే మోసం వచ్చింది

మొదటికే మోసం వచ్చింది

నేపాల్ ప్రధాని కెపి. శర్మ ఓలి చేసిన ఆరోపణలపై ఆయన సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు. భారత ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలే చేస్తూ దేశంతో (నేపాల్) ఆటలు ఆడుతున్నావని, వెంటనే ప్రధాని ప్రదవికి రాజీనామా చెయ్యాలని సొంత పార్టీ నేతలు నేపాల్ ప్రధాని కెపి. శర్మ ఓలిపై ఒత్తిడి చేస్తున్నారు. రాజకీయంగా భారత్ మీద ఆరోపణలు చేసి రాజకీయ లబ్దిపొందడానికి ప్రయత్నించిన నేపాల్ ప్రధాని కెపి. శర్మ ఓలికి మొదటికే మోసం వచ్చింది.

ప్రతాపం చూపిస్తున్న ప్రచండ

ప్రతాపం చూపిస్తున్న ప్రచండ

నేపాల్ ప్రధాని కెపి. శర్మ ఓలి పొరుగు దేశంపై చేస్తున్న ఆరోపణలతో నేపాల్ కు గల సంబంధాలు దెబ్బ తీస్తాయని, అది మన దేశ ప్రజలకు మంచిదికాదని, దౌత్యపరంగా ఆమోదయోగ్యం కాదని నేపాల్ మాజీ ప్రధాని పుష్పా కమల్ దహాల్ ప్రచండ మండిపడ్డారు. నేపాల్ ప్రధాని కెపి. శర్మ ఓలి నివాసంలో పాలక స్టాండింగ్ కమిటీ సమావేశం అయిన సమయంలో నేపాల్ మాజీ ప్రధాని పుష్పా కమల్ దహాల్ ప్రచండ ఆదేశ ప్రధాని కెపి. శర్మ ఓలిపై విరుచుకుపడటంతో ఆదేశ అధికార పార్టీ నాయకులు హడలిపోయారు.

నేపాల్ ప్రధాని వింత వాదన

నేపాల్ ప్రధాని వింత వాదన

తనకు, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంబసీలు, స్టార్ హోటల్స్ లో కుట్రలు జరుగుతున్నాయని నేపాల్ ప్రధాని కెపి. శర్మ ఓలి ఇటీవల తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కొందరు నేపాలీ రాజకీయ నాయకులు సైతం తనను పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని నేపాల్ ప్రధాని కెపి. శర్మ ఓలి ఆరోపణలు చేస్తున్నారు. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ ముందు పిల్లిగంతులు వెయ్యడానికి ప్రయత్నిస్తున్న నేపాల్ ప్రధాని కెపి. శర్మను వెంటనే రాజీనామా చెయ్యాలని ఆయన సొంత పార్టీ నేతలే ఒత్తడి చెయ్యడంతో ఆయనకు మొదటికే మోసం వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
PM Master Plan: Instability Stalks In Nepal As Calls For PM K P. Oli's Resignation Growing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X