వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్లో భూకంపం: హైద్రాబాద్ యువతి గల్లంతు, ఢిల్లీలో మళ్లీ ప్రకంపనలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ఖాట్మాండ్: నేపాల్‌లో హైదరాబాదుకు చెందిన ఓ యువతి ఆచూకీ గల్లంతైనట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు ఆమె వెళ్లారు. ఇప్పటి వరకు ఆమె ఆచూకీ దొరకలేదని తెలుస్తోంది. మరోవైపు, నేపాల్ భూకంపం ఘటనలో మృతుల సంఖ్య దాదాపు రెండువేలకు చేరుకుంది. నాలుగువేల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

నేపాల్లో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన తెలుగువారు మూడు వందల మందికి పైగా చిక్కుకున్నారని సమాచారం. ఆదివారం ఉదయం వరకు 56 మందిని సురక్షితంగా తీసుకు వచ్చారు. మిగతా వారిని సాయంత్రానికి తీసుకు రానున్నారు.

ఢిల్లీకి సురక్షితంగా చేరిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 19 మంది, తెలంగాణకు చెందిన 37 మంది ఉన్నారు. వీరిని ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌, విజయవాడకు తరలిస్తారు.

Nepal quake: Death toll crosses 2,000, Fresh Tremors Rock Delhi, Northern India

ఆయా రాష్ట్రాల హెల్ప్ లైన్ నెంబర్లు

తెలంగాణ: 09650990016, 040- 23454088
ఆంధ్రప్రదేశ్: 011-23385016
ఎన్డీఎంఏ: 01126701728/29
డబ్ల్యూబీ:1070
గుజరాత్: 079 23251900/ 079 23251902/14
మహారాష్ట్ర: 011- 23380326, 022-22027990
ఎంఈఏ 24 గంటల సేవలు, ఫోన్ నెంబర్లు: +91 11 2301 2113, +91 11 2301 4104, +91 11 2301 7905

ఢిల్లీలో ప్రకంపనలు

ఇప్పటికే నేపాల్, భారత్ తదితర దేశాలు భూకంపం, ప్రకంపనలతో వణుకుతున్నాయి. ఆదివారం కూడా పలుచోట్ల భూప్రకంపనలు వణికిస్తున్నాయి.

నేపాల్లో ఆదివారం ఉదయం మూడు గంటలు, ఐదు గంటలు, ఆరు గంటల సమయాల్లో ప్రకంపనలు వచ్చాయి. తాజాగా, దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీతో పాటు ఉత్తరాది, నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఈ భూప్రకంపనల కేంద్రం నేపాల్‌లో కేంద్రీకృతమైనట్లు అధికారులు చెప్పారు.

English summary
Nepal was shaken by a deadly earthquake that left over 2,000 people dead and over 4,000 injured, on Saturday, April 25. Reactions poured in from all across the world, condoling the loss of lives and damage of property.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X