వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్: 128గంటల తర్వాత ప్రాణాలతో బయటపడిన మహిళ

|
Google Oneindia TeluguNews

ఖాట్మాండ్: నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపధాటికి శిథిలాల కింద ఇరుక్కుపోయిన ఓ మహిళ 128 గంటలపాటు పోరాడి ప్రాణాలతో బయటపడింది. గత శనివారం నేపాల్‌లో 7.9 తీవ్రతతో సంభవించిన పెను భూకంపంలో 25 ఏళ్ల కృష్ణదేవీ ఖడ్క అనే మహిళ ఓ భవనం శిథిలాల కింద ఇరుక్కుపోయింది.

ఎన్డీఆర్ ఎఫ్, నేపాల్ ఆర్మీ దళాలు సంయుక్తంగా సహాయక చర్యలను నిర్వహించి కృష్ణదేవీని సురక్షితంగా కాపాడాయి. ఐదు రోజుల క్రితం సంభవించిన భూకంపంలో నేపాల్‌లోని గోంగబు గ్రామంలో ఓ గెస్ట్‌హౌస్ భవనం కుప్పుకూలడంతో శిథిలాల కింద ఇరుక్కుపోయింది. ట్టకేలకు ఎన్డీఆర్ ఎఫ్, నేపాల్ ఆర్మీ దళాల సాయంతో కృష్ణదేవీ మృత్యుంజయురాలి‌గా బయటపడింది.

మరో ఇద్దరిని కాపాడిన సహాయక బృందాలు

Nepal quake: Woman rescued alive after 128 hours

భూకంప శిథిలాల కింద నుంచి మరో ఇద్దరిని సైన్యం సురక్షితంగా రక్షించింది. ఇందులో ఒకరు యువకుడు కాగా, మరొకరు పదేళ్ల లోపు బాలుడు. వీరిద్దరికీ వైద్య చికిత్స అందజేస్తున్నారు. వారు భూకంపం షాక్‌నుంచి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

భూకంప ధాటికి మరణించిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. 15 వేలకు పైగానే చనిపోయి ఉంటారని అంచనావేస్తున్నారు. ఆర్మీ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. కొండచరియలు విరిగి పడి ధ్వంసమైన రోడ్లకు మరమ్మతుల చేస్తున్నారు.

భూకంప కేంద్ర పరిసర గ్రామాలకు సైతం సహాయం అందిస్తున్నారు. వాహనాల్లో ఆహార పదార్థాలు తీసుకు వెళ్లి అందజేస్తున్నారు. ప్రపంచ దేశాల సాయం నేపాల్‌కు అందుతోంది. ఎయిర్‌బస్‌లలో ఆహార పదార్థాలు, మెడిసిన్‌లను జర్మనీ దేశం నేపాల్‌కు పంపింది. రాజధాని ఖాట్మాండ్‌లో శిథిలాల తొలగింపు వేగవంతమైంది.

English summary
A woman was rescued alive from rubbles of a collapsed building after 128 hours in Nepal, which has been hit by a massive earthquake on April 25, a media report said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X