వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్‌పై అత్యాచార ఆరోపణలు...! రాజీనామా చేసిన నేపాల్ స్పీకర్

|
Google Oneindia TeluguNews

లైంగిక వేధింపుల ఆరోపణలతో నేపాల్ స్పికర్ కృష్ణ బహదూర్ మహరా తన పదవికి రాజీనామా చేశారు. మహారా తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ శివమయకు సమర్పించారు. నేపాల్ పార్లమెంట్‌లోని సెక్రటేరియట్ భవన్‌లో పని చేస్తున్న మహిళ ఉద్యోగిణి తనను లైంగిక వేధింపులకు గురి చేస్తూ... అత్యాచారం చేశారని ఆరోపణలు చేసింది.

లా విద్యార్థి కేసు : స్వామి చిన్మయానంద సంవత్సర కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు...లా విద్యార్థి కేసు : స్వామి చిన్మయానంద సంవత్సర కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు...

ఆమె ఆరోపణలను అక్కడి ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్‌లో వీడియోను విడుదల చేసింది. సెప్టెంబర్ 23 న తాను ఒంటరిగా ఉన్నప్పుడు మహారా తన అద్దె ఇంటికి వచ్చినట్టు ఉద్యోగిని తెలిపింది. అయితే తన ఇంటికి వచ్చినప్పుడు మద్యం మత్తులో ఉన్నాడని పేర్కోంది. మద్యం మత్తులో ఉన్న మహారాను ఇంట్లోకి రానీయకుండా చాలాసేపు ప్రయత్నించానని ఆమె తెలిపింది. అయినా స్పీకర్ వినలేదని చెప్పింది. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించాడని తెలిపింది. అనంతరం అసభ్య పదజాలంతో దూషించాడని వివరించింది. మహారా తనకు చాలా సంవత్సరాలుగా తెలుసని చెప్పిన ఆమె గతంలో కూడ చాలా సార్లు తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్టు ఆరోపణలు చేసింది.

Nepals Parliament Speaker resigned over allegation of raping a woman

స్పీకర్ మహారాపై వచ్చిన ఆరోపణలపై నేపాల్ కమ్యూనిస్టు పార్టీ చర్చించేందుకు సోమవారం సమావేశం అయింది. అనంతరం ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించింది. అత్యాచార ఆరోపణలపై విచారణ నిష్పాక్షికంగా జరిపేందుకు పదవి నుండి తప్పుకోవాలని సూచించింది. దీంతో స్పీకర్ మహారా మంగళవారం స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ఇక ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని సెక్రటేరియట్ సమావేశంలో నిర్ణయించామని ఎన్సీపీ అధికార ప్రతినిధి నారాయణ్ కజి శ్రేష్ణ వెల్లడించారు.

English summary
The Speaker of Nepal's Parliament resigned on Tuesday over allegation of raping a woman staffer in the federal parliament secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X