వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ్యాగీ నూడుల్స్ మటాష్: కుప్పలు పోశారు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మ్యాగీ నూడుల్స్ పై నిషేధం విధించడంతో మ్యాగీ పొట్లాలను తీసుకు వచ్చి ధ్వంసం చేస్తున్నారు. నిర్జనప్రదేశాలలోకి (ప్రయివేటు ప్రాంతం) మ్యాగీ నూడుల్స్ పొట్లాలను లారీలు, ట్రాక్టర్లతో పాటు 407 వాహనాలలతో తీసుకు వచ్చి ఒక చోట వేస్తున్నారు.

తరువాత బుల్డోజర్లతో వాటిని ధ్వంసం చేసి నిప్పంటించడానికి సిద్దం చేస్తున్నారు. వివిధ ప్రాంతాలలోని షాప్ లు, మాల్స్ లో ఉన్న మ్యాగీ స్టాక్ ను నెస్లె ఇండియా కంపెనీ ప్రతినిధులు వెనక్కి తీసుకుంటున్నారు. తరువాత వాటిని గౌడన్లకు తరలించారు.

 Nestle India is withdraw Maggi noodles

మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లను ధ్వంసం చేస్తామని నెస్లె ఇండియా కంపెనీ నిర్వహకులు గతంలో ప్రకటించారు.
చివరికి పలు వాహనాలలో వాటిని తీసుకు వచ్చి ధ్వంసం చేస్తున్నారు. చిన్న పిల్లలకు తినిపించే మ్యాగీ నూడుల్స్ లో ఎక్కవ శాతం సీసం ఉందని, ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వెలుగు చూసింది.

 Nestle India is withdraw Maggi noodles

తరువాత మ్యాగీ నూడుల్స్ ను నిషేధించాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. జాతీయ ఆహార భద్రతా సంస్థ మ్యాగీ నూడుల్స్ నిషేధిస్తున్నామని ఆదేశాలు జారీ చేసింది. నెస్లె ఇండియా కంపెనీ నిర్వహకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో రూ.320 కోట్ల విలువైన 27,420 టన్నులకు పైగా ఉన్న మ్యాగీ నూడుల్స్ ను ధ్వంసం చేస్తున్నారు.

English summary
Nestle India is withdrawing and destroying thousands of tonnes of Maggi noodles worth more than Rs 320 crore as ordered by the Indian food regulator.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X