వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మామ.. బావ ఇద్దరిదీ ఒకే శైలి:దూసుకెళ్తున్న ములాయం చిన్నకోడలు..

నేతాజీ ములాయం, వరుసకు బావ అయిన సీఎం అఖిలేష్ యాదవ్ ఇద్దరిదే ఒకే వ్యవహార శైలి అని, అంతిమంగా యూపీని అభివృద్ధి బాటలో నడిపించడమే తమ ధ్యేయమని అపర్ణ అన్నారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఇంతవరకు లక్నో కంటోన్మెంట్ నుంచి సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) గెలిచిన దాఖలా లేదు. ఇక్కడినుంచి బరిలో దిగిన ములాయం చిన్నకోడలు అపర్ణయాదవ్ మాత్రం తన శాయశక్తులా గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. మూడో దఫా ఎన్నికల్లో భాగంగా తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ఆమె దూసుకుపోతున్నారు.

ఆదివారం నాడు పోలింగ్ జరగనున్న లక్నో కంటోన్మెంట్ లో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ తో కలిసి అపర్ణ యాదవ్ ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. మంగళవారం నిర్వహించిన ఈ బహిరంగ సభలో ఓటర్లను ఆకట్టుకునేలా అపర్ణ ప్రసంగించారు. ఎస్పీలో రేగిన ముసలం ఓటర్లపై ప్రభావం చూపించకుండా ఉండేందుకు తామంతా ఒకటే అన్న సంకేతాలను ఆమె జనంలోకి పంపిస్తున్నారు.

చిన్నకోడలే చిచ్చు పెట్టిందా?: అఖిలేష్-ములాయం ముసలం వెనుక..చిన్నకోడలే చిచ్చు పెట్టిందా?: అఖిలేష్-ములాయం ముసలం వెనుక..

నేతాజీ ములాయం, వరుసకు బావ అయిన సీఎం అఖిలేష్ యాదవ్ ఇద్దరిదే ఒకే వ్యవహార శైలి అని, అంతిమంగా యూపీని అభివృద్ధి బాటలో నడిపించడమే తమ ధ్యేయమని అపర్ణ అన్నారు. ఎస్పీ అధికారంలోకి వచ్చాక లక్నో కంటోన్మెంట్ కు రూ.40కోట్ల అభివృద్ధి నిధులు కేటాయించారని, మరోసారి తమ పార్టీకి అవకాశం ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తామని అపర్ణ తెలిపారు.

Netaji and bhayya are did development in up says aparna yadav

పనిలో పనిగా తన తోడికోడలు, ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ గురించి కూడా అపర్ణ యాదవ్ కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ మధ్య బేధాభిప్రాయాలేమి లేవని, ఇప్పటికీ పలు వ్యక్తిగత విషయాలు సంతోషంగా పంచుకుంటామని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు.

అపర్ణయాదవ్ పాల్గొంటున్న ప్రచార సభల్లో 'ఫ్యూచర్ మినిస్టర్' అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తుండటం గమనార్హం. దీంతో ఆమె రెట్టించిన ఉత్సాహాంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. 'తొలుత నేను ఇక్కడి ఆడపడుచును.. ఆ తర్వాతే ములాయం కోడలిగా ప్రచారానికి వచ్చాను' అంటూ ఓటర్లను ఆకట్టుకునే వ్యాఖ్యలు చేశారు.

కాగా, అపర్ణయాదవ్ కు పోటీగా బీజేపీ నుంచి రీటా బహుగుణ బరిలో ఉన్నారు. రీటా బహుగుణ కాంగ్రెస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆమెపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీఎస్పీ నుంచి మరో బలమైన అభ్యర్థి యోగేష్ దీక్షిత్(53) బరిలో ఉన్నారు. మొత్తం మీద ఎస్పీకి అసలు పట్టే లేని నియోజకవర్గంలో అపర్ణయాదవ్ ఎంతవరకు నెట్టుకురాగలరో వేచిచూడాలి.

English summary
The electoral battle for Lucknow Cantonment assembly constituency is set to be interesting as two heavyweights – one of them new to politics and the other a veteran – are set to lock horns
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X