• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వేధింపులు.. పోర్న్ వీడియోలు లీక్ చేస్తానని బ్లాక్‌మెయిల్.. బయటపెట్టిన హీరోయిన్

|

సోషల్ మీడియాలో ఓ ప్రముఖ హీరోయిన్ పట్ల ఓ నెటిజెన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆమెను అసభ్యకర రీతిలో సంబోధించాడు. దీనిపై ఆమె అతన్ని ప్రశ్నించగా.. మొదట తన అకౌంట్ హ్యాక్ అయిందని కహానీలు చెప్పాడు. ఆపై నీ పోర్న్ వీడియోలు తన వద్ద ఉన్నాయంటూ ఆమెను బ్లాక్‌మెయిలింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ హీరోయిన్.. సదరు నెటిజెన్ బాగోతం మొత్తాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బయటపెట్టింది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. అసలేం జరిగింది.

హీరోయిన్ నమిత..

హీరోయిన్ నమిత..

పలు తెలుగు,తమిళ చిత్రాల్లో నటించిన హీరోయిన్ నమితకు సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. సెంథమిజ్ అనే ఓ నెటిజెన్ కూడా ఆమె ఫాలోవర్స్‌లో ఉన్నాడు. అయితే ఇటీవల అతను నమితను 'హాయ్ ఐటెం..' అంటూ సంబోధించడం మొదలుపెట్టాడు. దీంతో నమిత అతన్ని గట్టిగా ప్రశ్నించింది. ఏం చెప్పాలో తెలియక... తన అకౌంట్ హ్యాక్ అయిందని సెంథమిజ్ కహానీలు చెప్పాడు.

పోర్న్ వీడియోలు లీక్ చేస్తానని బెదిరింపు..

పోర్న్ వీడియోలు లీక్ చేస్తానని బెదిరింపు..

సెంథమిజ్ తన అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పడం నమిత నమ్మలేదు. ఉద్దేశపూర్వకంగా అతనే కామెంట్స్ చేసి కావాలని డ్రామాలు ఆడుతున్నాడని భావించింది. మరింత గట్టిగా నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన సెంథమిజ్.. 'నీ పోర్న్ వీడియోలు నా వద్ద ఉన్నాయి.. వాటిని బయటపెడుతా..' అని బెదిరింపులకు దిగాడు. అయితే అందులో నిజమెంతో తనకు తెలుసు కాబట్టి.. ఇష్టం వచ్చింది చేసుకుపొమ్మని చెప్పినట్టు నమిత ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ఆపై సెంథమిజ్ ఇన్‌స్టా ప్రొఫైల్‌ను పోస్ట్ చేసిన నమిత.. 'ఈ నీచుడి బాగోతం చూడండి' అంటూ ఒక పోస్ట్ పెట్టింది.

బయటపెట్టిన నమిత..

బయటపెట్టిన నమిత..

'చూడండి ఈ నీచుడిని.. స్త్రీలను ఇష్టమొచ్చినట్టు ఎలాంటి పేర్లతోనైనా పిలువవచ్చని భావించేవాడు. కానీ వాటిని నేనుందుకు భరించాలి. నేను కేవలం మీడియాలో, గ్లామర్‌ ప్రపంచంలో ఉన్నాను కాబట్టి.. ఇక నా గురించి మొత్తం తెలుసని భావిస్తున్నావా..? ఓ వ్యక్తిగా నా గురించి నీకేం తెలుసు..? నా నిశ్శబ్దాన్ని బలహీనత అనుకోకండి. నిజమైన మగాడికి స్త్రీని ఎలా గౌరవించాలో తెలుసు. ఎవరైనా తన సొంత తల్లిని అవమానపరిస్తే కలిగే బాధ అతనికి తెలుసు. నవరాత్రుల సందర్భంగా 9 రోజులు దుర్గా మాతను పూజించే బదులు సమాజంలో మహిళలను ఎలా గౌరవించాలో నేర్చుకో. ఎందుకంటే జీవితంలో అదే ముఖ్యమైనది..'అని నమిత తన పోస్టులో పేర్కొంది. సదరు యువకుడిపై ఆమె సైబర్ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం.

  PSPK 26 First Look : 8 Reasons Behind Powerstar Pawan Kalyan Craze!! | Oneindia Telugu
  View this post on Instagram

  Hi all, this one cheap minded, free loser has been calling me names in DM. As you can read he is @i_am_thamizh_senthamizh . He started with name calling like 'Hi Item' . Hence , when I confronted him , he said his account got hacked !!! And when I pursued him, he said he has seen my so called 'PORN' and he's going to publish it online now !!! Knowing the facts, I said pls 'Go ahead '.. See this face people ! This is the face of a Loser, a Cheap minded , Filthy person, who thinks he has Right to call any Woman, with any cheap and dirty names,just because he thinks He Can !!!! Why should I listen to this ?! Just because I'm in Media ?! Just because I'm in a Glamour Industry?! You think you know me ?! You think you know who I'm as a person ??! DO NOT MISTAKE MY SILENCE FOR MY WEAKNESS !! A Real Man knows how to Respect a Woman, Any Woman from Any path of Life, for he knows how it feels if someone will Disrespect his own Mother! Instead of Celebrating Navratri where you pray to Godess Durga for 9 days and instead of Celebrating Women's Day, learn to respect women in your General Life. Because that's what matters at the End of the Day!!

  A post shared by Namitha Vankawala Chowdhary (@namita.official) on

  English summary
  : A netizen abused heroine Namitha on Instagram,for that she countered him. She said first of all learn to respect women in the society in her insta post.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more