బాలీవుడ్ బ్యాన్ చేయండి, పోర్న్ కూడా: మోడీ లడాఖ్ పోస్ట్‌కు టిక్ టాక్ నెటిజన్ల రియాక్షన్ ఇదీ...
దేశంలో టిక్‌టాక్‌కు ఉన్న క్రేజే వేరు. పిల్లల నుంచి నడి వయసు వారి వరకు టిక్‌టాక్ చేస్తుంటారు. కొత్త ఆలోచనలతో వీడియో చేసి.. పోస్ట్ చేస్తుంటారు. అయితే తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా జవాన్లు భారత సైనికులను రాళ్లతో కొట్టి చంపడంతో పరిస్థితి మారిపోయింది. టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్ బ్యాన్ చేసింది. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో ఆ యాప్స్ కనిపించవు, ఇప్పటికే ఇన్ స్టాల్ చేసిన యాప్స్ కూడా డిస్ ప్లే కావు. దీంతో టిక్‌టాక్ తమ జీవితంలో ఒక భాగం అని అనుకొన్న కొందరు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రధాని మోడీకి సోషల్ మీడియాలో తమదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నారు.

ఇన్ స్టాలో పోస్ట్
శుక్రవారం ప్రధాని మోడీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ బిపిన్ రావత్‌తో కలిసి లడాఖ్ వెళ్లారు. దానికి సంబంధించిన పోస్ట్‌ను ఆయన ట్విట్టర్ బదులు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వాస్తవానికి మోడీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ట్వీట్లు చేసి.. నెటిజన్లతో ఆలోచనలు పంచుకుంటారు. కానీ టిక్ టాక్ బ్యాన్ చేసినందున మరో ప్లాట్ ఫాం ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేశారు. అయినప్పటికీ నెటిజన్లు దండయాత్ర చేశారు. తమ ఆరాధ్య యాప్ టిక్ టాక్ ఎందుకు బ్యాన్ చేశారని ఒక్కొక్కరు ఒకలా పోస్ట్ చేశారు.

సాహిత్యం రంగరించి...
మే 22వ తేదీన మోడీ సోషల్ మీడియోలో అంఫన్ తుఫాన్ గురించి పోస్ట్ చేశారు. తర్వాత ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. కొందరు తమ భావాన్ని వ్యక్తపరిస్తే, మరికొందరు సాహిత్యాన్ని రంగరించారు ఒకతను తాను ఫర్ ఫెక్ట్ కాదు అని పోస్ట్ చేయగా, మరొకరు రాక్ ఆన్ మూవీలో పాట సాహిత్యాన్ని రాశారు. టిక్ టాక్ కాదు మిగతా యాప్స్.. ముఖ్యంగా పబ్జీని కూడా బ్యాన్ చేయాలని కోరారు.

నెటిజన్ల పోస్టులు ఇలా...
టిక్ టాక్ మొబైల్ లెజండ్ అని ఎందుకు బ్యాన్ చేశారని ఒక నెటిజన్ మోడీని అడిగారు. మరొకరు టిక్ టాక్ కింగ్ అని.. కానీ వెళ్లిపోయిందని ప్రస్తావించారు. మరో నెటిజన్ అయితే పోర్న్, బాలీవుడ్ బ్యాన్ చేయాలని కోరాడు. కానీ టిక్ టాక్ కాదని పోస్ట్ చేశారు. ప్రపంచంలో గల ప్రజాస్వామ్య దేశాల్లో మోడీ ఉత్తమ ప్రధాని అని యునెస్కో ధృవీకరించిందని మరో నెటిజన్ పోస్ట్ చేశారు. టిక్ టాక్ బ్యాన్‌తో మన జీడీపీ పెరుగుతోందన్నారు. నాతో డ్యాన్స్ చేయాలని ఒకరు, నేను పాట పడతాను మరొకరు పోస్ట్ చేశారు.