చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: సూపర్ స్టార్ కు కరోనా బంధువా ? ఫామ్ హౌస్ లో ఎంజాయ్, ఈ -పాస్ ఎలా ఇచ్చారు ? విచారణ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ చెంగల్పట్టు/ తేనియంపేట్: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ వివాదంలో చిక్కుకున్నారు. ఆరోగ్య పరమైన వైద్య చికిత్సల కోసం ఈ- పాస్ తీసుకున్న రజనీకాంత్ ఫామ్ హౌస్ లో జల్సాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పుమన్నాయి. సూపర్ స్టార్ కు కరోనా ఏమైనా బంధువా ? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో కరోనా వైరస్ (COVID 19) తాండవం చేస్తోంది. కరోనా వైరస్ దెబ్బతో చెన్నై సిటీతో పాటు అనేక జిల్లాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది. జిల్లాల సరిహద్దులు దాటకూడదని ప్రభుత్వం నియమాలు పెట్టింది. వైద్య, ఆరోగ్య సమస్యలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎవరైనా సంచరించడానికి పోలీసులు ఈ- పాస్ మంజూరు చేస్తున్నారు. ఇలాంటి ఈ- పాస్ తీసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నారని, ఆయన కరోనాకు ఏమైనా బంధువా ? అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

క్వారంటైన్ లో యువతి హీరోయిన్ లా ఉందని, అర్దరాత్రి డాక్టర్ రెండుసార్లు, పాపం పండింది, సీసీటీవీల్లో !క్వారంటైన్ లో యువతి హీరోయిన్ లా ఉందని, అర్దరాత్రి డాక్టర్ రెండుసార్లు, పాపం పండింది, సీసీటీవీల్లో !

 చెన్నైలో జస్ట్ 90 వేలు

చెన్నైలో జస్ట్ 90 వేలు

తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1, 92, 964కు పెరిగింది. ఇప్పటి వరకు తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 3, 232 మంది కరోనా వైరస్ తో మరణించారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలో పరిస్థితి సరేసరి. చెన్నై సిటీలో ఏకంగా 90, 900 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. చెన్నై సిటీలో గత 24 గంటల్లో 1, 336 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గత కొన్ని రోజులతో పోల్చుకుంటే చెన్నై సిటీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని అధికారులు, స్థానిక ప్రజలు అంటున్నారు.

 చెన్నై లాక్ డౌన్

చెన్నై లాక్ డౌన్

చెన్నైలో విపరీతంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో చెన్నై సిటీతో పాటు చుట్టుపక్కల ఉన్న ఐదు జిల్లాల్లో గత కొన్ని రోజుల నుంచి లాక్ డౌన్ అమలులో ఉంది. చెన్నై సిటీ ప్రజలు ఇతర జిల్లాలకు వెళ్లకుండా, ఇతర జిల్లాల ప్రజలు చెన్నై సిటీలో అడుగు పెట్టకుండా తమిళనాడు ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.

 రయ్ రయ్ మంటూ పెళ్లిన రజనీకాంత్

రయ్ రయ్ మంటూ పెళ్లిన రజనీకాంత్

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన లగ్జరీ కారులో రయ్ రయ్ అంటూ చెన్నైలోని కీలంపేట్ లోని ఇంటి నుంచి కీళంబాక్కం వైపు దూసుకువెళ్లారని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ ముఖానికి మాస్క్ వేసుకుని ఆయనే స్వయంగా లగ్జరీ కారు నడుపుకుంటూ చెంగల్పట్టు జిల్లాలోని కీళంబాక్కం వైపు వెలుతున్న సమయంలో కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో అవి వైరల్ అయ్యాయి.

 ఫామ్ హౌస్ లో ఎంజాయ్ !

ఫామ్ హౌస్ లో ఎంజాయ్ !

చెన్నై జిల్లా సరిహద్దులు దాటిన సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం చెలంగల్పట్టు జిల్లాలోని కీళంబాక్కంలోని ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కీళంబాక్కంలోని ఫామ్ హౌస్ లో రెండో కూతురు, అల్లుడితో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ కాలం గడుపుతున్నారని కొన్ని ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. ఫామ్ హౌస్ లో రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 ఈ- పాస్ తీసుకున్నారా ?

ఈ- పాస్ తీసుకున్నారా ?

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ- పాస్ తీసుకుని చెన్నై సిటీని దాటారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. వైద్య, ఆరోగ్య పరమైన విషయంగా రజనీకాంత్ సంబంధిత అధికారుల నుంచి ఈ- పాస్ పొందారని తెలిసింది. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ- పాస్ తీసుకున్నారా ? ఎందుకు ఈ- పాస్ తీసుకున్నారు ? అనే విషయంపై చెన్నై సిటీ కార్పొరేషన్ కమిషనర్ ప్రకాశ్ విచారణ చేపట్టారని సమాచారం. ఈ- పాస్ తీసుకునే రజనీకాంత్ చెన్నై సిటీ దాటారని, ఆయన లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించలేదని అభిమాన సంఘాల నాయకులు గట్టిగా చెబుతున్నారు. రూ. 100 చెల్లించి TN06 R- 9297 కారు నెంబర్ తో రజనీకాంత్ ఈ పాస్ జులై 23వ తేదీ తీసుకున్నారని, అయితే ఆయన జులై 20వ తేదీన ఎలా ప్రయాణించారని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

Recommended Video

Air India To Send Employees On Leave Without Pay For Up To 5 years || Oneindia Telugu
 గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ?

గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ?

తమిళనాడులో ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రజలు జిల్లాల సరిహద్దులు దాటాలంటే వీలుకావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ- పాస్ మంజూరు చెయ్యడానికి అధికారులు సామన్య ప్రజలకు మూడు చెరువుల నీళ్లు తాగించి ముప్పుతిప్పలు పెడుతున్నారని ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో ఎప్పుడైనా ఈ- పాస్ తీసుకున్నారా ? ఇటీవల మాత్రమే ఈ పాస్ తీసుకుని చెన్నై సిటీ దాటారా ? అనే అనుమానాలు ఉన్నాయని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Lockdown: Netizens questions on Rajinikanth E Pass for Teynampet to Kelambakkam near Cengalpattu in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X