• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిర్మలా సీతారామన్ కామెంట్లపై నెటిజన్ల సెటైర్లు : కూరగాయాల విక్రయాలకు జొమాటో, స్విగ్గీ కారణమా..?

|

న్యూఢిల్లీ : దేశంలో కార్ల విక్రయాలు పడిపోవడానికి క్యాబ‌‌్‌లే కారణమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సెలవిచ్చిన సంగతి తెలిసిందే. ఆటోమొబైల్ విక్రయాలు పడిపోవడానికి క్యాబ్‌లే కారణమని .. యువత కార్లు కొనేందుకు ఇష్టపడటం లేదని పేర్కొన్నారు. కారు కొనుక్కొని ఈఎంఐ కట్టుకొవడం కన్నా .. క్యాబ్ బుక్ చేసుకోవడమే మేలని అనుకొంటున్నారని తెలిపారు. అయితే కేంద్రమంత్రి కామెంట్లపై నెటిజన్లు ఫైరవుతున్నారు. కార్ల కొనుగోళ్లకు క్యాబ్‌ల వాడటానికి సంబంధం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్కరు రకరకలుగా స్పందిస్తున్నారు.

నెటిజన్ల సెటైర్లు

నెటిజన్ల సెటైర్లు

సోషల్ మీడియా ట్విట్టర్‌లో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దేశంలో ఆరోగ్యం, పరిసరాలు చాలా ముఖ్యమని గుర్తుచేస్తున్నారు. వాహనాల వాడకంతో కాలుష్యమే అనే విషయాన్ని విత్త మంత్రి మరచిపోయినట్టున్నారు కానీ పేర్కొన్నారు. ఆటో మొబైల్ విక్రయాలపై ఆలోచించడం.. ఇందుకు క్యాబ్‌లు కారణమని చెప్పడం దారుణమంటున్నారు నెటిజన్. మరో నెటిజన్ స్పందిస్తూ కేంద్ర సంస్థ .. బీఎస్ఎన్‌ఎల్‌లో 80 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. అక్కడ ఏం పని ఉన్న లేకున్నా అంతమంది ఉన్నారని .. కానీ ఆటోమొబైల్ విక్రయాలపై సాకులు చెప్పడం సరికాదని మోడీ సర్కార్‌కు సూచించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఉపాధి కల్పించడం లేదని మరొకర విమర్శించారు. తన మేనిఫెస్టోను బీజేపీ మరచిపోయిందా అని ప్రశ్నించారు.

ఐస్‌క్రీమ్ విక్రయాలు కూడా ..

ఐస్‌క్రీమ్ విక్రయాలు కూడా ..

మరో నెటిజన్ స్పందిస్తూ .. ఇటీవల ఐస్‌క్రీం విక్రయాలు కూడా పడిపోయాయని గుర్తుచేశారు. ఇందుకు కారణం టై, మీడియా అని .. వారు ఐస్‌క్రీమ్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని దుయ్యబట్టారు. టెడ్డీ వేర్ విక్రయాలు కూడా పడిపోయాయని ... వారిని కూడా నరేంద్ర మోడీ కౌగిలించుకోవడమేనని సెటైర్లు వేశారు. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చిన్నపిల్లలా మాటల్లాగా ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం 5 నుంచి 10 ఏళ్లుగా విక్రయించిన వాహనాలను అనుమతించని చెప్పడం కూడా ఒక కారణమేనని గుర్తుచేస్తున్నారు. షేర్ మార్కెట్ కూడా పడిపోతుందని .. ఇందుకు మిలియన్ల మంది కూడా స్టాక్స్ కొనుగోలు చేయడమా అని ప్రశ్నించారు. మరొకరు ఏకంగా సాధువుల ఫోటో షేర్ చేస్తూ .. వీరి వల్లే వస్త్ర ఉత్పత్తి పడిపోతుందని పేర్కొన్నారు. అయితే ఆ ఫోటోలో కర్ణాటక సీఎం యడియూరప్ప ఉండటం విశేషం.

 స్పేస్‌లో తమ స్పేస్ కోసం ..

స్పేస్‌లో తమ స్పేస్ కోసం ..

మరో నెటిజన్ ముందడుగు వేసి విక్రమ్ ల్యాండర్ కూలిపోవడానికి చాలా మంది ప్రజలు స్పేస్‌లో తమ సొంత స్థలం కావాలని అన్వేషించడమేనని పేర్కొన్నారు. మరోకరు అయితే ఢిల్లీలో టిప్పర్ ట్రక్కుల వినియోగం తగ్గింది .. కారణం ఏంటంటే అంబాసిడర్ వాహనాల్లోనే చెత్త అంత తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. బెల్ కూడా పడపోయిందని .. కారణం ఏంటో తెలుసా ప్రజలు పానిపూరీ వైపు మొగ్గడమేనని తెలిపారు. మరోవైపు కార్టూన్ చానెళ్ల రేటింగ్ కూడా పడిపోయిందని ... కారణం దీపక్ చౌరసియాను పిల్లలు చూడటమేనని పేర్కొన్నారు. కూరగాయాల విక్రయాలు కూడా తగ్గాయి .. జొమాటో, స్విగ్గీ అంటేనే ప్రజలు మక్కువ చూపుతున్నారని తెలిపారు. మోడీ ఫాలొవర్లు కూడా పెరిగారు .. కారణం ఏంటో తెలుసా .. నిరుద్యోగ యువత కూడా పెరిగింది కదా అని గుర్తుచేస్తున్నారు. మరోకరు ఒకడుగు ముందుకేసి దేశంలో కండోమ్ విక్రయాలు కూడా పడిపోయాయని .. ప్రజలనే ప్రభుత్వమే వేధిస్తుందనే అర్థంతో మరొ నెటిజన్ స్పందించారు.

English summary
BJP govt is not fulfilling promises made in their manifesto on job creation because ModiJi wants Millennials to be a successful memer on Twitter. All the graduates are installing tea stalls as there are great opportunities to become prime Minister
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X