వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం: అంద‌రికీ వ్యాక్సిన్ ఇస్తామ‌ని ఎప్పుడూ చెప్ప‌లేదన్న కేంద్రం -ఇండియానే బెస్ట్

|
Google Oneindia TeluguNews

పుట్టుకొచ్చి ఏడాది దాటినా కరోనా వైరస్ విలయం ఇంకా కొనసాగుతూనే ఉంది. గ్లోబల్ గా కేసులు 6.4కోట్లకు, మరణాలు 15లక్షలకు పెరిగాయి. ఇండియాలో కేసులు 95లక్షలకు, మరణాలు 1.5లక్షలకు చేరువయ్యాయి. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా ఈనెలలో పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని ఆశించినా, అవి సామాన్య జనానికి చేరాలంటే మరో మూడేళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి. పలు దేశాలు ఇప్పటికే రెండో సారి లాక్ డౌన్ లోకి వెళ్లిపోగా.. ఇండియాలో వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం కీలక కామెంట్లు చేసింది..

ఓటింగ్ తగ్గుదల కేసీఆర్ కుట్ర -ఈసీ కూడా దోషే -విజయశాంతి తాజా సంచలనంఓటింగ్ తగ్గుదల కేసీఆర్ కుట్ర -ఈసీ కూడా దోషే -విజయశాంతి తాజా సంచలనం

అందరికీ ఇస్తామలేదు..

అందరికీ ఇస్తామలేదు..

దేశంలో ఉన్న ప్ర‌జ‌లంద‌రికీ క‌రోనా వ్యాక్సిన్ ఇస్తామ‌ని ఎప్పుడూ చెప్ప‌లేద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేష్ భూష‌ణ్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. దేశవ్యాప్తంగా టీకా వేయాల్సిన అవసరముందని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి సాంకేతికపరమైన విషయాలు మాట్లాడేటపుడు సరైన సమాచారం ఉంటేనే మాట్లాడగలమన్నారు.

యాక్టివ్ కేసులు తగ్గాయి..

యాక్టివ్ కేసులు తగ్గాయి..

వ్యాక్సిన్‌ ఇవ్వడం అనేది దాని సమర్థతపై ఆధారపడి ఉంటుందని, వైరస్‌ వ్యాప్తి గొలుసు తెంచడమే వ్యాక్సిన్‌ ప్రధాన ఉద్దేశమని ఐసీఎంఆర్‌ డీ అన్నారు. ప్రస్తుతం మన దేశంలో కరోనా యాక్టివ్‌కేసులు 5లక్షల కంటే తక్కువగానే ఉన్నాయని, రోజూవారీగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీలు అధికంగా ఉండటంతో యాక్టివ్‌కేసుల శాతం తగ్గిందని ఆయన గుర్తుచేశారు.

Recommended Video

COVID-19 : All Party Meeting డిసెంబర్ 4న అఖిలపక్ష భేటీ.. అన్ని పార్టీలకు పిలుపు!!
 ప్రపంచంలోనే బెస్ట్..

ప్రపంచంలోనే బెస్ట్..

కరోనా కేసులకు సంబంధించి కేంద్రం మంగళవారం వెల్లడించిన వివరాల్లో.. రికవరీ రేటు ప్రపంచ దేశాలకంటే మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. పాజిటివిటీ కేసుల్లో క్రియాశీల కేసుల వాటా మరింత తగ్గి 4.60 శాతానికి చేరగా, రికవరీ రేటు 93.94శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. కొత్తగా కోలుకున్న కేసుల్లో 76.82 శాతం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. తాజాగా సంభవిస్తున్న మరణాలకు సంబంధించి 81.12 శాతం ఘటనలు పది రాష్ట్రాలు, యూటీల్లో ఉన్నాయని, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు.

నిర్బంధ ఓటింగే శరణ్యమా?: గ్రేటర్‌లో ఓ చోట పోలింగ్ మరీ 0.74శాతమా? -కరెంట్, ఇంటర్నెట్ ఆఫ్ చేయాల్నా?నిర్బంధ ఓటింగే శరణ్యమా?: గ్రేటర్‌లో ఓ చోట పోలింగ్ మరీ 0.74శాతమా? -కరెంట్, ఇంటర్నెట్ ఆఫ్ చేయాల్నా?

English summary
there was never any talk of inoculating the whole population of the country with Covid-19 vaccine, the Centre said on Tuesday said. Responding to a question at a press briefing, ICMR director general Balram Bhargava said the purpose of the Covid vaccine drive would be to break the chain of viral transmission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X