వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకటి కాదు రెండు కాదు.. ఐదోసారి వరించిన విజయం : ఐఏఎస్‌క ఎంపికైన బీఎస్ఎఫ్ జవాను

|
Google Oneindia TeluguNews

లుధియానా : పట్టుదలతో శ్రమించాలే గానీ విజయం దానంతట అదే వస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఎన్నిసార్లైనా క్రమం తప్పకుండా ప్రయత్నం చేయాలని టాపర్లు రుజువు చేస్తున్నారు. ఏ టాపర్ ఒక్కసారికే విజయం సాధించలేరు. రెండు, మూడో ప్రయత్నంలో గోల్ సాధిస్తారు. అలాగే పంజాబ్‌కు చెందిన బీఎస్ఎఫ్ అధికారి కూడా ఐదోసారి ప్రయత్నించి .. తన చిరకాల వాంఛ అయిన ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.

సామాన్య కుటుంబం ..
పంజాబ్‌లోని లుధియానాక చెందిన హరిప్రీత్ .. తండ్రి వ్యాపారం చేస్తుంటారు. తల్లి టీచర్‌గా పనిచేసేవారు. గ్రీన్ గ్లోవ్ పబ్లిక్ స్కూలులో పాఠశాల విద్య సాగింది. తర్వాత బీఈ గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రానిక్స్‌లో చేశారు. హరిప్రీత్‌కు ఒక చెల్లి కూడా ఉన్నారు. తర్వాత సివిల్స్ కోసం తన ప్రయత్నాన్ని ప్రారంభించారు. 2016లో యూపీఎస్పీ పరీక్షలు రాయగా బీఎస్ఎఫ్ ఆఫీసర్ క్యాడర్‌గా ఎంపికయ్యారు. అలా విధులు నిర్వర్తిస్తూనే సివిల్స్ పరీక్షలు రాస్తున్నారు. ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్‌లో బీఎస్ఎఫ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తూ .. సివిల్స్ రాస్తున్నారు.

‘Never stop’, says BSF officer who made it to IAS in 5th attempt

2017లో సివిల్స్ రాశారు. అయితే దేశవ్యాపతంగా 454 ర్యాంకు వచ్చింది. దీంతో ఆయన ఐటీఎస్ (ఇండియన్ ట్రేడ్ సర్వీసు) ఎంపికయ్యారు. ఐటీఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోసారి సివిల్స్ రాశారు. మరుసటి ఏడాది 19వ ర్యాంకు వచ్చి .. హరిప్రీత్ కల సాకారమైంది. దీంతో ఆయన ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమి నుంచి వచ్చేశారు. సివిల్స్‌కు ఎంపికవడంపై హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు సివిల్స్ రాసేవారు .. తమ ప్రయత్నాలను నిరంతరం చేస్తూ ఉండాలని సూచిస్తున్నారు. లక్ష్యం కోసం నిరంతరం ప్రయత్నిస్తే విజయం తనంతట అదే వస్తోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సివిల్స్ రాసే అభ్యర్థులకు కూడా అదే సలహా, సూచనలు ఇస్తున్నారు.
English summary
harpreet Hailing from Ludhiana district of Punjab, Harpreet did his schooling from Green Grove Public School, Khanna and has a BE degree in Electronics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X