వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని కోసం ప్రత్యేక సొరంగమార్గం నిర్మాణం..కొత్త పార్లమెంటు భవనంలో ప్రత్యేకతలేంటి..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు భవనంకు మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలో ప్రధాని నివాసం నుంచి ఆయన కార్యాలయానికి, పార్లమెంటు భవనంకు ప్రత్యేక రహదారిని డిజైన్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఒక టన్నెల్‌ను నిర్మించేందుకు సన్నహాలు చేస్తున్నారు ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ బిమాల్ పటేల్ . ప్రధాని పార్లమెంటు భవనంకు లేదా అతని కార్యాలయానికి వెళుతున్న సందర్భంలో ట్రాఫిక్‌‌ను క్లియర్ చేసేందుకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో పార్లమెంటు భవనంకు కొన్ని ప్రత్యేక రహదారులు నిర్మించాలని పటేల్ చెప్పారు. . అంతేకాదు ఈ టన్నెల్ మార్గం ద్వారా ప్రధానితో పాటు ఇతర వీఐపీలు కూడా ప్రయాణం చేయుచ్చని స్పష్టత ఇచ్చారు..

ప్రధాని కోసం ప్రత్యేక సొరంగ మార్గం

ప్రధాని కోసం ప్రత్యేక సొరంగ మార్గం


పార్లమెంటు రీడిజైన్‌పై సీఈపీటీ యూనివర్శిటీలో సమావేశం జరిగింది. రీడిజైన్‌పై పలు విషయాలను పంచుకున్నారు డిజైన్ ప్లానర్ బిమాల్ పటేల్. పార్లమెంటుకు వచ్చేలా ప్రత్యేక దారుల నిర్మాణం చేపట్టాలని బిమాల్ పటేల్ సూచించారు. ప్రధానికోసం ప్రత్యేక టనెల్ నిర్మించాలని సూచించారు. దీనివల్ల సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది కలగదని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తవని వెల్లడించారు. ఇక ముందుగా ప్రాణహాని ఉన్న వీఐపీల జాబితాను తయారు చేసి వారందరినీ ఈ టనెల్ ద్వారానే తరలించే ఏర్పాటు చేయాలని పటేల్ సూచించారు.

నార్త్ సౌత్‌ బ్లాకుల్లో నేషనల్ మ్యూజియం

నార్త్ సౌత్‌ బ్లాకుల్లో నేషనల్ మ్యూజియం


రెండు గంటల పాటు జరిగిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో ప్రధాని నివాసంను సౌత్ బ్లాక్‌ వద్దకు మార్చాలని చెప్పారు బిమాల్ పటేల్. ఉపరాష్ట్రపతి నివాసాన్ని నార్త్ బ్లాక్ వద్దకు మార్చాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న మిలటరీ అధికారుల నివాసాలకు బదులుగా అక్కడ ఎస్పీజీ కార్యాలయం రావాలని చెప్పారు. ఇక ఇప్పటి వరకున్న నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌‌లలో పలువురు కేంద్రమంత్రుల నివాసాలు ఉండేవి. మాస్టర్ డిజైన్ ప్రకారం సౌత్ బ్లాక్‌ను మ్యూజియంగా తయారు చేయాలని ఇందులో 1857 వరకు భారత్‌లో జరిగిన ముఖ్య ఘట్టాలకు సంబంధించిన అన్ని అంశాలు ఉంటాయని బిమాల్ పటేల్ చెప్పారు.

అండర్ గ్రౌండ్ మార్గాల నుంచి నేరుగా ఆఫీసుల్లోకి..

అండర్ గ్రౌండ్ మార్గాల నుంచి నేరుగా ఆఫీసుల్లోకి..


అండర్‌గ్రౌండ్ రహదారులను నిర్మిస్తామని ఇది అన్ని భవంతులకు కనెక్ట్ అవుతుందని చెప్పారు. బేస్‌మెంట్‌ వద్ద ఉద్యోగస్తులు నడక ప్రారంభిస్తే వారు వెళ్లాల్సిన భవంతిలోకి నేరుగా వెళ్లిపోయేలా ప్లాన్ డిజైన్ చేస్తున్నట్లు చెప్పారు. దుబాయ్ సింగపూర్ విమానాశ్రయాల్లో ఈ తరహా పద్ధతే అమలవుతోందని చెప్పారు. ఇక పర్యావరణంపై పలువురు ఔత్సాహికులు బిమాల్ పటేల్‌ను ప్రశ్నించారు. ఈ తరహా అండర్‌గ్రౌండ్ రహదారులతో దాదాపు 50వేల నుంచి 60వేల మంది ఉద్యోగస్తులు కాలుష్యం నుంచి కాపాడబడుతారని చెప్పారు. ఇక పాత భవంతులు కూల్చివేసి అందులో పనికొచ్చేవన్నిటినీ పడవేయకుండా కొత్త భవన నిర్మాణాల కోసం వినియోగిస్తామని చెప్పారు.

ఇక కొత్తగా రీడిజైన్ చేయనున్న పార్లమెంటులో 1548 సీట్లు ఉంటాయని చెప్పారు. ఇందులో ఎంపీల కోసం 1000 చాంబర్లు ఉంటాయన్నారు. కొత్త పార్లమెంటు భవనం బంగారు రంగులో వెలుగులు విరజిమ్ముతుంటుందని చెప్పారు. 2024కల్లా ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తవుతుందని బిమాల్ పటేల్ చెప్పారు.

English summary
The new Central Vista in Delhi will have a dedicated tunnel road for the movement of Prime Minister from his residence to office and the parliament building.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X