వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచానికి మరో టెన్షన్.. 70 శాతం వేగంగా కరోనా కొత్త రకం వైరస్: భయపడొద్దన్న భారత కేంద్ర మంత్రి

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి నుండి బయట పడటం కోసం ప్రపంచం ప్రయత్నం చేస్తున్న సమయంలో కరోనా వైరస్ రూపాంతరం చెంది వ్యాప్తంగా విస్తరించడం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడు ప్రపంచానికి రూపాంతరం చెందుతున్న కొత్త కరోనా వైరస్ టెన్షన్ పట్టుకుంది . ఇప్పటికే బ్రిటన్లో ఈ కొత్తరకం కరోనా కేసులు విస్తరిస్తున్నట్టు గుర్తించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త కరోనా వైరస్ పై అధ్యయనం చేస్తోంది. అయితే ప్రస్తుతం రూపాంతరం చెందిన కరోనా వైరస్ పాత కరోనా వైరస్ కంటే మరింత వేగంగా విస్తరిస్తోంది.

పాత వైరస్ కంటే70 శాతం వేగంగా కొత్త రకం వైరస్

పాత వైరస్ కంటే70 శాతం వేగంగా కొత్త రకం వైరస్

పాత వైరస్ కంటే70 శాతం వేగంగా కొత్త రకం వైరస్ ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్ , దక్షిణాఫ్రికా తదితర దేశాలలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది అని, ఈ వైరస్ పై ప్రస్తుతం తయారుచేసిన వ్యాక్సిన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఇంకా చూడాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పటికే కరోనా వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, కరోనా కట్టడి చేయడం సాధ్యమవుతుందని అంచనా వేసుకున్న దేశాలకు ఇప్పుడు కరోనా కొత్త వైరస్ దెబ్బకు వ్యాక్సిన్ పని చేస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

యూకే లో కొత్త కరోనా వేరియంట్ .. అలెర్ట్ అయిన భారత్ సర్కార్

యూకే లో కొత్త కరోనా వేరియంట్ .. అలెర్ట్ అయిన భారత్ సర్కార్

అయితే కరోనా కొత్తరకం వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం మొత్తాన్ని అలర్ట్ చేసింది. కొత్తగా రూపాంతరం చెందుతున్న వైరస్ 70 శాతం స్పీడ్ గా విస్తరిస్తోంది అని నిపుణులు వెల్లడిస్తున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో కొత్త కొరోనావైరస్ వ్యాప్తి నేపధ్యంలో మన దేశంలో కూడా అలెర్ట్ అయ్యామని, ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ ఈ రోజు అన్నారు, ప్రజలు ఎవరుభయపడాల్సిన అవసరం లేదు అని ఆయన పేర్కొన్నారు .

ఊహాత్మక భయాందోళనలకు గురి కాకండి : కేంద్ర మంత్రి హర్షవర్ధన్

ఊహాత్మక భయాందోళనలకు గురి కాకండి : కేంద్ర మంత్రి హర్షవర్ధన్

కెనడా, సౌదీ అరేబియా మరియు అనేక యూరోపియన్ దేశాలు కొత్త కరోనా వైరస్ జాతి వ్యాప్తి నేపథ్యంలో యుకె నుండి విమానాలను తాత్కాలికంగా నిషేధించాయి.ఈ సమయంలో, ఊహాత్మక పరిస్థితులు, ఊహాత్మక చర్చలు మరియు ఊహాత్మక భయాందోళనలతో ఇబ్బంది పడకండి అంటూ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది . కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ప్రజల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అంతగా భయపడటానికి ఎటువంటి కారణం లేదు అని ఆరోగ్య మంత్రి భారత సైన్స్ ఫెస్టివల్ లో అన్నారు.యుకె ప్రయాణ నిషేధాన్ని విధించాలని భారత్ యోచిస్తుందా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్‌లో ప్రభుత్వాన్ని కోరిన కొద్దిసేపటికే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

Hyderabad : Nehru Zoological Park Gets ISO Certification From UK
సూపర్ స్ప్రెడర్ గా కొత్త వైరస్ .. సెప్టెంబర్ నుండి శరవేగంగా విస్తరిస్తున్న న్యూ వేరియంట్

సూపర్ స్ప్రెడర్ గా కొత్త వైరస్ .. సెప్టెంబర్ నుండి శరవేగంగా విస్తరిస్తున్న న్యూ వేరియంట్

సూపర్ స్ప్రెడర్ అయిన యుకెలో కరోనా వైరస్ యొక్క కొత్త మ్యుటేషన్ ఉద్భవించింది. యుకె నుండి అన్ని విమానాలను వెంటనే నిషేధించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.రూపాంతరం చెందిన వైరస్ మొట్టమొదట ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో సెప్టెంబర్‌లో కనుగొనబడింది. ఇది త్వరగా లండన్ మరియు యూకే లోని ఇతర ప్రాంతాలలో ఆధిపత్య జాతిగా మారుతోంది . క్రిస్‌మస్ వేడుకల్లో పెరిగే అవకాశం ఉన్న క్రమంలో లాక్ డౌన్ కు దారితీసింది .ఆదివారం, బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ "కొత్త వేరియంట్ నియంత్రణలో లేదు" అని చెప్పారు. అయినప్పటికీ, బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ "ఇది మరింత తీవ్రమైన అనారోగ్యానికి కారణమైనట్లు ఆధారాలు లేవు" అని పేర్కొనటం గమనార్హం .

English summary
A new type of corona virus came to light in UK is 70 percent faster than the old virus. At the same time, India also became alert. Union Health Minister says people no need to panic about the new variant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X