వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేగంగా వ్యాపిస్తోన్న కొత్త రకం వైరస్ -ఒక్క రోజులోనే 9 కొత్త కేసులు.. మొత్తం 82: కేంద్రం

|
Google Oneindia TeluguNews

దేశంలో సాధారణ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండగా.. బ్రిటన్ నుంచి పుట్టుకొచ్చిన కొత్తరకం వైరస్‌ కలవరం రోజురోజుకూ పెరుగుతోంది. కొవిడ్‌ స్ట్రెయిన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 82 మంది కొత్తరకం వైరస్‌ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది.

భారత్‌లో కరోనా: సరికొత్త రికార్డు -ప్రపంచంలోనే అత్యధిక రికవరీ రేటు -కొత్తగా 18,139 కేసులుభారత్‌లో కరోనా: సరికొత్త రికార్డు -ప్రపంచంలోనే అత్యధిక రికవరీ రేటు -కొత్తగా 18,139 కేసులు

జనవరి 6 నాటికి ఈ సంఖ్య 73గా ఉండగా, గురువారం ఒక్కరోజే కొత్తగా 9 కేసులు బయటపట్టాయి. దీంతో కేసుల సంఖ్య 82కు పెరిగింది. స్ట్రెయిన్‌ బాధితులను ఆయా రాష్ట్రాల్లో సింగిల్‌ రూం ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన వారితోపాటు, తోటి ప్రయాణికులను, కుటుంబసభ్యులను గుర్తిస్తున్నట్లు పేర్కొంది.

 New Covid strain: Indias tally reaches 82 after 9 more UK returnees test positive

భారత్ లో యూకే స్ట్రెయిన్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఇటీవల మూడు వారాల పాటు భారత్‌-యూకే మధ్య విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసిన పౌర విమానయాన శాఖ.. తాజాగా ఆ నిషేధం ఎత్తేసింది దీ. బుధవారం నుంచి భారత్‌ -యూకే మధ్య తిరిగి విమాన సర్వీసులు ప్రారంభం కాగా.. శుక్రవారం యూకే-భారత్‌ సేవలు పునరుద్ధరించారు. అయితే

బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులోనే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. అంతేగాక, విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. సాధారణ కేసులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెలువరించిన లెక్కల ప్రకారం కొత్తగా 18,139 కేసులు, 234 మరణాలు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,04,13,417కు, మరణాల సంఖ్య 1,50,570కి పెరిగాయి.

English summary
The number of people who have tested positive for the new UK variant of SARS-CoV-2 has climbed to 82 in India, the health ministry said on Friday. The number of such people stood at 73 till January 6, it added. “The total number of cases infected with the new strain of the novel coronavirus, first reported in the UK, now stands at 82,” the ministry said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X