వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్ లైన్ లో 2వేల రూపాయాల నగదు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ :కరెన్సీ నోట్లు కూడ వస్తువులుగా మారిపోయాయి. పెద్ద నగదునోట్లను రద్దు చేయడంతో కొత్త కరెన్సీ కూడ వస్తువు కింద మారింది. చిల్లర నగదు లేకపోవడం.. కొత్త కరెన్సీ కోసం బ్యాంకులు, ఎటిఎం ల వద్ద బారులు తీరుతున్నారు జనం. అయితే ఈ భాదలు తప్పించుకోవాలంటే ఆన్ లైన్ లో రెండు వేల రూపాయాల నగదు నోటును విక్రయిస్తున్నారు.

కొత్త రెండు వేల రూపాయాల నగుద కోసం ఆన్ లైన్ లో కూడ తీసుకోవచ్చును. అయితే ఒక్కో నోటుకు 1500 రూపాయాలను అదనంగా చెల్లించాల్సిందే ఆన్ లైన్ లో వస్తువులను కొనుగోలు చేసినట్టుగానే కొత్త కరెన్సీ నోట్లను కూడ విక్రయానికి పెట్టింది ఒక ఆన్ లైన్ పోర్టల్.

new currency sale for online portal

ఫ్యాన్సీ నెంబర్ల నగదు కూడ ఓకే

కొత్త కరెన్సీ కొసం బ్యాంకులు, ఎటిఎం ల వద్ద బారులు తీరకుండా సులభంగా ఇంటికే డబ్బులు రావాలంటే ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల్సిందే. క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లిస్తే ఇంటికే కొత్త కరెన్సీ నోట్లు వస్తాయి. ఈ నగదును తీసుకుని అవసరాలు తీర్చుకోవచ్చు. అయితే అసలు కొంటే కొసరు ఎక్కువ అన్నట్టుగా అసలు నోటు కంటే అదనంగా 1500 రూపాయాలు చెల్లించాల్సి వస్తోంది.

మరో వైపు ప్యాన్సీ నెంబర్లు ఉన్న కొత్త కరెన్సీ నోట్లు కావాలంటే కూడ ఈ సంస్థ అందించనుంది. అయితే ఫ్యాన్సీ నెంబర్లకు ఎక్కువ ఛార్జీలను వసూలు చేయనున్నారు.నగదు నోట్ల విక్రయానికి సంబందించి ఇప్పటివరకు ఎలాంటి ఆర్డర్లు రాలేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే నగదును విక్రయించడంపై న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు గాను అమ్మకం డీల్ ను సైట్ ను తొలగించారు సంస్థ ప్రతినిధులు.గత ఏడాది జూలైలో యూనిక్ నెంబర్లు ఉన్న ఇండియన్ కరెన్సీని ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారన్న కారణంగా మద్య ప్రదేశ్ హై కోర్టు పలు ఆన్ లైన్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

English summary
New 2000 rupee currency for sale in online portal. around 1500 rupees pay extra for 2000 rupees new currency. if an anyone want fancy numbers of currency pay huge money to portal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X