వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లోకి డేంజర్ డ్రగ్.. ‘చైనా వైట్’.. మార్ఫిన్, హెరాయిన్ కన్నా వంద రెట్లు పవర్ ఫుల్!

చైనా నుంచి భారత్ కి మరో ప్రమాదం వచ్చిపడింది. మార్ఫిన్ లేదా హెరాయిన్ కన్నా వంద రెట్లు శక్తివంతమైన.. ప్రమాదకరమైన డ్రగ్ ‘చైనా వైట్’. ప్రస్తుతం ఈ డ్రగ్ మయన్మార్ మీదుగా భారత నార్కోటిక్స్ మార్కెట్ లోకి ప్రవ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

'Chaina White' Drug Enteres In India భారత్ లోకి డేంజర్ డ్రగ్..| Oneindia Telugu

చైనా నుంచి భారత్ కి మరో ప్రమాదం వచ్చిపడింది. భారత్ ను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ తోపాటు చైనా కూడా ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతుల్లో ప్రయత్నిస్తోంది.

మార్ఫిన్ లేదా హెరాయిన్ కన్నా వంద రెట్లు శక్తివంతమైన.. ప్రమాదకరమైన డ్రగ్ 'చైనా వైట్'. ప్రస్తుతం ఈ డ్రగ్ మయన్మార్ మీదుగా భారత నార్కోటిక్స్ మార్కెట్ లోకి ప్రవేశించింది.

‘చైనా వైట్’ మత్తులో ఢిల్లీ యువత?

‘చైనా వైట్’ మత్తులో ఢిల్లీ యువత?

దేశ రాజధాని ఢిల్లీలోని యువత చైనా నుంచి వస్తోన్న భయంకర డ్రగ్ ‘చైనా వైట్'కు అలవాటు పడినట్లు తెలుస్తోంది. డ్రగ్ స్మగ్లర్లు ఈ డ్రగ్ ను మయన్మార్ నుంచి మిజోరామ్, మణిపూర్ మీదుగా ఢిల్లీకి చేరవేస్తున్నట్లు సమాచారం. సబ్బు పెట్టెలు, బొమ్మలు, బూట్లు, కాస్మోటిక్స్‌ వస్తువుల ద్వారా ఈ చైనా వైట్‌ డ్రగ్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నారు. విమాన మార్గాల్లో కూడా ఈ భయంకరమైన డ్రగ్ భారత్ లో ల్యాండ్ అవుతోంది.

భారత్ లోకి ప్రవేశంపై కేంద్రం ఆందోళన

భారత్ లోకి ప్రవేశంపై కేంద్రం ఆందోళన

మొన్నటి వరకు కెనడా, అమెరికాలకే పరిమితమైన ఈ ‘చైనా వైట్' ఇప్పుడు భారత మార్కెట్ లోకి ప్రవేశించడంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ డ్రగ్ అధిక డోస్ తీసుకున్న కారణంగా కెనడాలో రోజుకు ఇద్దరు చొప్పున మరణిస్తున్నారు.

మోతాదుకు మించి తీసుకుంటే.. మరణమే...

మోతాదుకు మించి తీసుకుంటే.. మరణమే...

ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాప్‌ గాయకుడు ప్రిన్స్‌ కూడా ఈ డ్రగ్‌ను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మరణించినట్లు అమెరికా వైద్యులు ధ్రువీకరించారు. ఒక్క 2016లోనే అమెరికాలో 20,100 మంది ఈ డ్రగ్‌ ఓవర్‌ డోస్‌ కారణంగా మరణించారు. గతంతో పోలిస్తే మృతుల సంఖ్య 540 రెట్లు పెరిగిందని అమెరికా పోలీసు అధికారులు చెబుతున్నారు.

అక్రమ సాగు, రవాణా...

అక్రమ సాగు, రవాణా...

మయన్మార్, లావోస్, థాయ్‌లాండ్‌ మధ్యనున్న గోల్డెన్‌ ట్రయాంగిల్‌ ప్రాంతంలో దీన్ని ఎక్కువగా పండిస్తున్నారు. గంజాయిని అక్రమంగా పండిస్తున్న దేశాల్లో మయన్మార్‌ ప్రపంచంలోనే రెండవ స్థానాన్ని ఆక్రమించింది. ఒక్క 2006 నుంచి 2013 మధ్య కాలంలోనే ఆ దేశంలో గంజాయి సాగు రెండింతలు పెరిగింది.

గసగసాలకు వాటిని జోడించి...

గసగసాలకు వాటిని జోడించి...

హెరాయిన్ తరహాలోనే ఈ డ్రగ్ ను ముక్కుతో పీల్చడం, ఇంజెక్షన్ ద్వారా రక్తంలోకి ఎక్కించుకోవడం చేస్తుంటారు. చైనా వైట్ గా పిలిచే ఈ డ్రగ్ ను ఫెంటానిల్ అనే మొక్కల నుంచి తయారు చేస్తారు. గసగసాలకు ఫెంటానిల్‌ మొక్కల ఆకులను, కొద్ది మోతాదులో హెరాయిన్‌ను కలిపి ఈ చైనా వైట్‌ డ్రగ్ ను తయారు చేస్తున్నారు.

పట్టుకున్న పోలీసులు...

పట్టుకున్న పోలీసులు...

మయన్మార్ నుంచి భారీ ఎత్తున సరఫరా అయిన ఈ చైనా వైట్ డ్రగ్ ను బుధవారం మిజోరామ్ పోలీసులు పట్టుకున్నారు. అంతకుముందు ఢిల్లీలో మన పోలీసులు కూడా 12 కేజీల చైనా వైట్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్ లో రూ.50 కోట్లు ఉంటుందని అంచనా.

English summary
It can be a hundred times more potent than morphine or heroin and mere inhalation or contact with the skin can cause an overdose resulting in death. The new designer drug, 'China White', has injected itself into the bloodstream of the Indian narcotics market through Myanmar. The substance is a highly potent heroin substitute made from fentanyl - an opioid pain medication with a rapid onset and short duration of action. It works like any other opiate and comes in powdered form, which can be inhaled or injected. 'The designer synthetic drug that is consumed more in the US is now gaining popularity among users in the national Capital. As the demand has increased, traffickers have become active and are supplying consignments from Myanmar to Mizoram and Manipur. It further reaches Delhi and then routes to other states,' said a highly placed source in the narcotics control department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X