వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశీయ విమానాలను నడిపించడానికి సిద్ధపడుతోన్న వేళ.. ఎయిరిండియా హెడ్ ఆఫీస్ క్లోజ్: ఆ ఉద్యోగికి..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి ప్రత్యేక విమానాలను నడిపిస్తోన్న వేళ..ఈ నెల 18వ తేదీ నుంచి దేశీయ విమాన ప్రయాణాలకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోన్న దశలో.. ఎయిరిండియా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దేశ రాజధానిలోని తన ప్రధాన కార్యాలయాన్ని మూసివేసింది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఉత్తర్వులను జారీ చేసింది. ఆ మరుక్షణమే ఆ కార్యాలయ భవనానికి తాళాలు పడ్డాయి. పార్లమెంట్ స్ట్రీట్‌లోని మహదేవ్ రోడ్‌లో ఈ కార్యాలయం కొనసాగుతోంది.

విశాఖలో మంత్రుల నిద్ర వెనుక అసలు ప్లాన్ ఇదేనా?: ఇక జగన్ కూడా: త్వరలో క్యాంపు కార్యాలయం షిఫ్ట్?విశాఖలో మంత్రుల నిద్ర వెనుక అసలు ప్లాన్ ఇదేనా?: ఇక జగన్ కూడా: త్వరలో క్యాంపు కార్యాలయం షిఫ్ట్?

దీనికి కారణం- ఆ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకడమే. అంతకుముందే ఎయిరిండియాకే చెందిన అయిదుమంది పైలెట్లు ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రత్యేక విమానాలను నడిపిస్తోన్న నేపథ్యంలో కొద్దిరోజుల కిందటే ఢిల్లీలోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయం తన కార్యాలయాలను పునఃప్రారంభించింది. పైగా- ఈ నెల 17వ తేదీన మూడోదశ లాక్‌డౌన్ ముగియబోతోండగా..మరుసటి రోజు నుంచే డొమెస్టిక్ విమాన ప్రయాణాలను చేపట్టడానికి ఎయిరిండియా సన్నాహాలు చేస్తోంది.

New Delhi: Air India office sealed after employee tests positive for Covid-19

ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతిరోజూ ప్రధాన కార్యాలయానికి వచ్చే ఉద్యోగులు, ఇతర సిబ్బందికి కరోనా వైరస్ పరీక్షలను నిర్వహిస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా- సోమవారం ఉదయం కూడా పరీక్షించారు. వాటి నివేదికలు మంగళవారం అందాయి. ఒక ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. అతనిలో వైరస్ లక్షణాలు కనిపించడంతో హుటాహుటిన కార్యాలయాన్ని సీల్ చేశారు. గ్రేటర్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు.

New Delhi: Air India office sealed after employee tests positive for Covid-19

Recommended Video

Domestic Flights May Resume By May 18, Aarogya Setu App Is Mandatory For Passengers

సమాచారాన్ని అందుకున్న వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎయిరిండియా భవనాన్ని సీల్ చేశారు. శానిటైజేషన్ పనులను చేపట్టారు. డిస్ ఇన్‌ఫెక్టెంట్‌తో భవనం నలుమూలలను శుభ్రం చేస్తున్నారు. 54 సంవత్సరాల అటెండర్ ఒకరు వైరస్ బారిన పడినట్లు నిర్ధారితమైంది. దీనితో ఉద్యోగులు, ఇతర అధికారులు ఉలిక్కిపడ్డారు. పలువురు ఉద్యోగులు ఫైళ్లు, ఇతర వస్తువులు అటెండర్ ద్వారా అందుకున్న వారిలో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.

English summary
Air India headquarters in Delhi has been sealed after a peon in the Commercial Operations department tested positive for coronavirus. Santisation process underway. The peon aged 54 years was working in Air India Office, Mahadeo Road on the Parliament Street. He has been home quarantined. The entire Air India building has been sealed at present for sanitisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X