చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెవ్వుకేక: వినాయక చవితికి కైలాస దేశం కోసం కొత్త బ్యాంకులు, కరెన్సీ, చట్టాలు, నిత్యానందస్వామి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ చెన్నై/ న్యూయార్క్: వివాదాస్సద స్వామిజీ నిత్యానంద మాయం కావడంతో ఆయన దేశం విడిచిపారిపోయాడని జోరుగా ప్రచారం జరిగింది. అత్యాచారం ఆరోపణలు, మైనర్ అమ్మాయిలను ఆశ్రమయంలో అక్రమంగా నిర్బంధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద స్వామి కరోనా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో భారతదేశం వదిలిపారిపోయారని స్వయంగా పోలీసులే చెప్పారు. అయితే ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన నిత్యానంద ఓ వీడియో విడుదల చేశారు. వినాయక చవితి రోజు మీకు ఓ శుభవార్త చెబుతానని, కొన్ని రోజులు మీరు ఆగాలని నిత్యానంద ఆయన భక్తులకు సందేశం ఇచ్చారు. కైలాసదేశం సృష్టించుకుని ఆ దేశానికి A to Z నిత్యానంద అయ్యారని ప్రచారం జరిగింది. కైలాసదేశానికి కొత్త చట్టాలు, కొత్త కరెన్సీ నోట్లు, కొత్త బ్యాంకులు సృష్టించుకుని వాటి వివరాలను వినాయక చవితి రోజు నిత్యానంద స్వామి విడుదల చేస్తారని సమాచారం. నువ్వు కెవ్వుకేక స్వామి అంటూ సోషల్ మీడియాలో నిత్యానందపై జోరుగా చర్చ జరుగుతోంది.

lockdown: కింద మొగుడు, పైన ప్రియుడు, హైటెక్ వ్యభిచారం కోసం సీక్రెట్ రూమ్, సినిమా స్కెచ్, రివర్స్!lockdown: కింద మొగుడు, పైన ప్రియుడు, హైటెక్ వ్యభిచారం కోసం సీక్రెట్ రూమ్, సినిమా స్కెచ్, రివర్స్!

స్వామి సామాన్యుడు కాదు

స్వామి సామాన్యుడు కాదు

ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటి సమీపంలోని బిడిదిలో నిత్యానంద స్వామికి చాలా పెద్ద ఆశ్రమం ఉంది. బిడిదిలోని ధ్యానపీఠ ఆశ్రమయంలో ఉంటున్న మహిళపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద ఇప్పటికే జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పటికీ నిత్యానందపై నమోదైన రేప్ కేసు విచారణ కోర్టులో పెండింగ్ లో ఉంది.

నకిలీ పాస్ పోర్టుతో ఎస్కేప్ ?

నకిలీ పాస్ పోర్టుతో ఎస్కేప్ ?

రేప్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలోనే గుజరాత్ లో మైనర్ అమ్మాయిలను అక్రమంగా నిర్బంధించారని స్వయంగా అమ్మాయిల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడం, కేసులు నమోదు కావడంతో నిత్యానంద షాక్ కు గురైనారు. కేసులు నమోదు చేసిన పోలీసులు నిత్యానంద కోసం గాలిస్తున్న సమయంలోనే ఆయన నకిలీ పాస్ పోర్టు ఉపయోగించి దేశం విడిచిపారిపోయాడని ఆరోపణలు ఉన్నాయి. గత ఆరు నెలల నుంచి నిత్యానంద కోసం పోలీసులు గాలిస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేకపోయింది.

కైలాస దేశానికి నేనే రాజు నేనే మంత్రి

కైలాస దేశానికి నేనే రాజు నేనే మంత్రి

దేశం విడిచిపారిపోయిన నిత్యానంద విదేశాల్లో ఓ ద్వీపం కొనుగోలు చేసి ఆ ప్రాంతానికి కైలాసదేశం అని నామకరణం చేసినట్లు చాలా కాలం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కైలాసదేశానికి నేనే రాజు నేనే మంత్రి అంటూ నిత్యానంద కొన్ని వీడియోలు విడుదల చేశారని ఆయన భక్తులు అన్నారు. ప్రముఖ బహుబాష నటి కైలాసదేశానికి ప్రధాన మంత్రి అవుతారని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే అధికారికంగా నిత్యానంద కైలాసదేశానికి ప్రధాన మంత్రి ఎవరు ? అనే విషయం ఇంత వరకు ప్రకటించలేదు.

 ఇండియా టూర్ కు సర్వర్ ప్రాబ్లమ్ ?

ఇండియా టూర్ కు సర్వర్ ప్రాబ్లమ్ ?

తాను భారతదేశానికి రావాలని ఉందని, అయితే కొన్ని లక్షల మంది విదేశాల నుంచి భారత్ కు వస్తున్నందున తనకు విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని, ఆన్ లైన్ లో విమాన టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి సర్వర్ సమస్యల కారణంగా తాను విమాన టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నానని వీడియోలో సందేశం పంపించారని ఆయన భక్తులు ఓ సినిమా స్టోరీ చెబుతున్నారు.

వినాయక చవితికి విడుదల

వినాయక చవితికి విడుదల

దేశం విడిచిపారిపోయాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద స్వామి ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యారు. కైలాసదేశం గురించి వినాయక చవితి రోజు తాను కీలక ప్రకటనలు చేస్తానని, కొన్ని రోజుల్లో మీకు మంచి శుభవార్త చెబుతానని నిత్యానంద స్వామి ఆయన భక్తులకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

కొత్త బ్యాంకు, దేశీయ కరెన్సీ !

కొత్త బ్యాంకు, దేశీయ కరెన్సీ !

కైలాసదేశానికి తాను మంచి చెయ్యాలని నిర్ణయించానని, ప్రపంచంలోనే కైలాసదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని, మంచి పనులు చెయ్యడానికి తాను కొత్త బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నామని నిత్యానంద స్వామి వీడియోలో వివరించారు. రిజర్వు బ్యాంకు నియమాలు పాటించి కైలాసదేశంలో తాను కొత్త బ్యాంకులు, దేశీయ కరెన్సీ ఏర్పాటు చేస్తానని, కైలాసదేశానికి దేశీయ కరెన్సీని రూపొందించారని, భారీ మొత్తంలో విరాలాలు ఇవ్వడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని నిత్యానంద స్వామి వివరించారు.

Recommended Video

జాతీయ పత్రిక సర్వే.. అగ్ర స్థానం లో Yogi Adityanath | YS Jagan | KCR | Arvind Kejriwal || Oneindia
కైలాసానికి కొత్త చట్టాలు !

కైలాసానికి కొత్త చట్టాలు !

కైలాసదేశానికి కొత్త చట్టాలు, 300 పేజీల ఆర్థిక విధానాలు కూడా సిద్దం చేశారని, వాటి వివరాలనే నిత్యానంద స్వామి వినాయక చవితి రోజు విడుదల చేస్తారని ఆయన భక్తులు చెబుతున్నారు. రిజర్వు బ్యాంకు నియమాల ప్రకారమే కైలాసదేశానికి దేశీయ కరెన్సీ కూడా ముద్రించారని, వాటికి రిజర్వు బ్యాంకు అమోదం ఉంటుందని నిత్యానంద భక్తులు అంటున్నారు. అయితే వినాయక చవితి రోజు నిత్యానంద స్వామి ఆయన భక్తులను ఉద్దేశించి ఏమి చెబుతారు ? అంటూ ప్రజలతో పాటు ఆయన్ను అరెస్టు చెయ్యడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

English summary
New Delhi: Nithyananda says that he has some important announcement on Vinayaka chaturthi and he has started Reserve Bank of Kailasa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X