వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

135 years ఇండస్ట్రీ: సోనియానే చీఫ్ ? రాహుల్, ప్రియాంక ఎంట్రీ !, మోఢీని ఢీకొట్టాలంటే ఏం చెయ్యాలి!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ జైపూర్/ ముంబై: దేశ రాజకీయాల్లో 135 years పొలిటికల్ (ఇండస్ట్రీ ) హిస్టరీ ఉన్న కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎవరు ? అనే ఉత్కంఠ మొదలైయ్యింది. అసలే కష్టకాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎత్తులకు చిత్తు అవుతున్న కాంగ్రెస్ పార్టీ సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే పనిలో నిమగ్నం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ పదవి కాలం నేటితో (సోమవారం) పూర్తి కానుంది.

Recommended Video

Telangana Congress Rally Against Electricity Charges Hike

ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పగ్గాలు మళ్లీ సోనియా గాంధీకే అప్పగిస్తారా ? యువరాజు రాహుల్ గాంధీకి అప్పగిస్తారా ? ఏమైనా ప్రియాంకా ఎంట్రీ ఇస్తారా ? అంటూ కాంగ్రెస్ నాయకులు ఓ వైపు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ!Gold smuggling: నేను ముద్దమందారం, ముట్టుకుంటే, రూ. 100 కోట్ల స్కామ్, నో బెయిల్, ఈడీ కస్టడీ!

 నరేంద్ర మోఢీతో ఢీకొనేది ఎవరు ?

నరేంద్ర మోఢీతో ఢీకొనేది ఎవరు ?

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా మన పార్టీలో ఎవరికి ఉంది ? ఎవరిని అధ్యక్ష పదవిలో కుర్చోపెడుదాం ? అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిజీబిజీగా చర్చించుకుంటున్నారని తెలిసింది. మరోసారి సోనియా గాంధీకి పగ్గాలు అప్పగిస్తారా ? లేదా యువరాజు రాహుల్ గాంధీకి అప్పగిస్తారా ? లేక ఇందిరా గాంధీ వారసురాలిగా ప్రియాంకా ఎంట్రీ ఇస్తారా ? సీనియర్ నేతలను ఎవరినైనా సీల్ లోకి తెస్తారా ? అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాలుగా ఆలోచిస్తున్నారు.

మేడమ్ డెడ్ లైన్

మేడమ్ డెడ్ లైన్

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక జాతీయ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ పదవి కాలం నేటితో పూర్తి కానుంది. 135 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో సమర్థవంతమైన నాయకులు కరువయ్యారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో గత ఏడాది (2019) ఆగస్టు 10వ తేదీన కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీని ఆ పార్టీ నాయకులు ఎన్నుకున్నారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ గా ఉన్న సోనియా గాంధీ పదవి కాలం ఆగస్టు 10వ తేదీ సోమవారంతో ముగుస్తుంది.

మీ నిర్లక్షం వలనే కరోనా రెచ్చిపోయింది

మీ నిర్లక్షం వలనే కరోనా రెచ్చిపోయింది

దేశంలో కరోనా వైరస్ వ్యాపించడానికి కేంద్ర ప్రభుత్వ నిర్లక్షమే కారణం అని, ముందు వెనుకా ఆలోచించకుండా లాక్ డౌన్ అమలు చేసి కూలి కార్మికులు, పేదల ప్రాణాలతో, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఇన్ని రోజులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ వస్తున్నారు.

రాహుల్ రాజీనామా, మేడమ్ కు కుర్చి

రాహుల్ రాజీనామా, మేడమ్ కు కుర్చి

కాంగ్రెస్ పార్టీ నియమాల ప్రకారం ఆ పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే వరకు సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలి పదవిలో కొనసాగుతారని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ అంటున్నారు. గత ఏడాది లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. తరువాత కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కుర్చీలో కుర్చొన్నారు.

సోనియా గాంధీ హవా

సోనియా గాంధీ హవా

1998లో సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీపై పట్టుసాధించారు. 1998 నుంచి 2017వ వరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలి పదవిలో సోనియా గాంధీ కొనసాగారు. సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలోనే యునైటెడ్ ప్రోగ్రసీవ్ అలయన్స్ (యూపీఏ) కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి రావడం, డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా కొనసాగడం జరిగింది.

తొందర ఎందుకు ఫ్రెండ్స్ ?

తొందర ఎందుకు ఫ్రెండ్స్ ?

నరేంద్ర మోడీ ప్రధాని అయిన తరువాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం శూన్యం. ఇప్పుడు సోనియా గాంధీనే కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతారని, పార్టీ నేతలు అందరూ చర్చించి ఓ నిర్ణయం తీసుకున్న తరువాతే అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని, ఇప్పుడు అంత తొందరగా నిర్ణయం తీసుకోవాల్సి అవసరం ఏమీ లేదని రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ అంటున్నారు. మొత్తం మీద సోనియా గాంధీ సెంటిమెంట్ ను మరోసారి ప్రయోగించాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారని తెలిసింది.

English summary
New Delhi: Congress National Spokesperson Abhishek Manu Singhvi said that Congress interim president Sonia Gandhi's tenure is 'coming to an end', but that does not mean the party is becoming 'headless' at the stroke of the midnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X