వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీల కోసం 36 కొత్త బంగళాలు.. ఎక్కడో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎంపీల కోసం కొత్తగా 36 డూప్లెక్స్ ఫ్లాట్ల నిర్మాణం చేపట్టేందుకు యోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం నార్త్ అవెన్యూ ప్రాంతాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈ కొత్త బంగ్లాలనీ పాత బంగ్లాలను కూల్చి నిర్మిస్తామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ పాత బంగ్లాలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉన్నాయని ఆయన చెప్పారు. కొత్తగా నిర్మాణం అయ్యే బంగ్లాలన్నీ రాష్ట్రపతి భవన నిర్మాణంతో పోలిఉంటాయని అధికారి వివరించారు. ఇక ఈ బంగ్లాలను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నిర్మిస్తుందని స్పష్టం చేశారు.

సౌత్ మరియు నార్త్ అవెన్యూలో ఉన్న పాత బంగళాలను దశలవారీగా కూల్చి అక్కడ కొత్త బంగ్లాలను నిర్మిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇక రెండో దశలో వీటి నిర్మాణం జరుగుతుందని వివరించిన అధికారి... తొలి దశలో 36 గృహాలను నార్త్ అవెన్యూలో నిర్మించామని కొద్దిరోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ వాటికి గృహప్రవేశం చేశారని చెప్పారు. కొత్తగా నిర్మాణం చేపట్టబోయే నివాసాలు 36 అని చెప్పిన అధికారి అందులో మోడ్యులర్ కిచెన్, నాలుగు బెడ్‌రూంలు, ఒక లిఫ్టు, ఆఫీస్ ఏరియాలు ఉంటాయని చెప్పారు.

bungalows

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక అప్పటి బంగ్లాల్లోనే ఎంపీలు నివాసముంటున్నారని చెప్పారు. వీటిని దశల వారీగా కూల్చి కొత్త బంగ్లాలను నిర్మిస్తామని చెప్పారు. మరో ఏడాదిన్నర సమయంలోకొత్త బంగ్లాల నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఇక ఈ గృహాల్లో సోలాన్ ప్యానెల్స్, ఎల్‌ఈడీ లైట్లు, రెండు కార్లు పార్క్ చేసుకునేలా పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

English summary
The government plans to construct 36 new duplex flats for Members of Parliament in North Avenue in Lutyens' Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X