వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరెన్సీ కష్టాలు తీరేనా, రోజుకు కోటి కొత్త ఐదువందల నోట్ల ముద్రణ

పెద్ద నగదునోట్ల రద్దు తర్వాత కొత్త ఐదువందల రూపాయాల నగదు నోట్లను పెద్దఎత్తున ముద్రిస్తున్నారు. గతంలో 35 లక్షల చొప్పున ముద్రించే సంఖ్యను ప్రస్తుతం కోటికి పెంచారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

మహరాష్ట్ర :ఐదు వందల రూపాయాల కొత్త కరెన్సీ నోట్లు త్వరలో బ్యాంకులకు పెద్ద ఎత్తున రానున్నాయి. కొత్త ఐదు వందల రూపాయాల నగదు నోట్ల ముద్రణను మూడు రెట్లు పెంచేశారు. కొత్త ఐదువందల రూపాయాల నగదు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే కరెన్సీ కష్టాలు భారీగా తగ్గే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంకు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత కొత్త ఐదు వందల నగదు నోటు ముద్రణలో లోపాలు చోటుచేసుకొన్నాయి. నవంబర్ చివరివారం, డిసెంబర్ తొలివారంలో కొత కరెన్సీ బ్యాంకులకు వచ్చింది. అయితే ఈ నోటులో ముద్రణ లోపాలున్నాయని గుర్తించారు.

కొత్త ఐదువందల నగదు నోటులో ముద్రణ లోపాలు ఉండడంతో కొత్త నోట్లు మార్కెట్ లోకి రావడంతో ఆలస్యమైంది. దీంతో కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. అయితే కొత్త కరెన్సీ నోటు కష్టాలను తగ్గించేందుకు ఐదువందల రూపాయాల నగదు ముద్రణను పెంచారు.

రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా పెద్ద మొత్తంలో ఐదువందల రూపాయాల నోటును ఎక్కువగా ముద్రించేందుకు రిజర్వ్ బ్యాంకు చర్యలు తీసుకొంది. డిసెంబర్ 30వ, తేది వరకే రద్దుచేసిన నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో కొత్త కరెన్సీనే చలామణి చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

కొత్త ఐదువందల నగదు నోట్లు భారీగా ముద్రణ

కొత్త ఐదువందల నగదు నోట్లు భారీగా ముద్రణ

నవంబర్ 8వ, తేది రాత్రి పూట కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దుచేసింది.ఈ నగదను రద్దుచేసిన తర్వాత కొత్త నగదు ప్రజల డిమాండ్ కు తగ్గట్టుగా ప్రజలకు అందుబాటులో లేదు. ఈ కారణంగా ప్రజలకు కరెన్సీ కష్టాలు ఏర్పడ్డాయి. అయితే కొత్త రెండువేల రూపాయాలను అందుబాటులోకి తెచ్చారు. వెయ్యి రూపాయల నగదు ముద్రణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఐదువందల నోటులో ముద్రణలోపాలు వచ్చాయి. వారం రోజుల నుండి కొత్త ఐదువందల రూపాయాల నగదు నోటు బ్యాంకులకు చేరింది.అయితే కొత్త ఐదు వందల నగదు నోట్ల ముద్రణను భారీగా పెంచారు.గతంలో 35 లక్షల కరెన్సీని ముద్రిస్తుండగా ,ప్రస్తుతం ఈ ముద్రణను కోటికి పెంచారు.

ఎక్కడ నోట్లు ముద్రిస్తున్నారు.

ఎక్కడ నోట్లు ముద్రిస్తున్నారు.

దేశంలోని నాలుగు చోట్ల మాత్రమే నగదు ముద్రణ చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో రిజర్వ్ బ్యాంకు పరిధిలో రెండు ప్రెస్ లలో ముద్రిస్తున్నారు. పశ్చిమబెంగాల్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ లో , మహరాష్ట్రలోని నాసిక్ లో నగదును ముద్రిస్తున్నారు. దేశంలో నెలకొన్న కరెన్సీ డిమాండ్ ను దృస్టిలో ఉంచుకని ప్రతి రోజూ సుమారు 11 గంటల పాటు నిరంతరాయంగా కొత్త నగదును ముద్రిస్తున్నారు. ఈ ప్రింటింగ్ ప్రెస్ లలో పనిచేసే సిబ్బందికి సెలవులు కూడ ఇవ్వడం లేదు.
మద్యాహ్న భోజనం , రాత్రి భోజన విరామ సమయాల విషయాల్లో కూడ కోత విధించారు. అయినా దేశంలోని ప్రజల డిమాండ్ కు సరఫరా నగదు సరఫరా కావడం లేదు.

బ్యాంకులకు పెద్ద ఎత్తున చేరుతున్న కొత్త కరెన్సీ

బ్యాంకులకు పెద్ద ఎత్తున చేరుతున్న కొత్త కరెన్సీ

పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత పెద్ద ఎత్తున కొత్త కరెన్సీ రిజర్వ్ బ్యాంకుకుచేరుతోంది.శుక్రవారం నాడు సుమారు 4.30 కోట్ల నగదును రిజర్వ్ బ్యాంకు కు చేరింది. వాటిలో 1.1 కోట్ల 500 రూపాయాల నోట్లు, వంద రూపాయాల నోట్లు సుమారు 1.2 కోట్లు, యాభై రూపాయాలనోట్లు , ఇరవై రూపాయాల నగదు నోట్లు కోటి రూపాయాల చొప్పున రిజర్వ్ బ్యాంకుకుచేరాయి.పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత పెద్ద ఎత్తున రిజర్వ్ బ్యాంకుకు నగదు వచ్చిందని అధికారులు చెబుతున్నారు. నవంబర్ 11వ, తేదిన 50 లక్షల500 రూపాయాలు వచ్చాయి.

కొత్త సంవత్సరంలోనైనా కరెన్సీ కష్టాలు తీరుతాయా

కొత్త సంవత్సరంలోనైనా కరెన్సీ కష్టాలు తీరుతాయా

2017 జనవరి రెండవ వారానికైనా కరెన్సీ కష్టాలు తీరుతాయా అనే విషయమై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అయితే ఫిబ్రవరి మాసం చివరినాటికి కొత్త కరెన్సీ కష్టాలు తీరే అవకాశం ఉందని కొందరు అధికారులు అభిప్రాయంతో ఉన్నారు.అయితే దీనిపై ఇంకా అధికారికంగా దృవీకరించలేదు.గత 43 రోజుల్లో నాసిక్ ప్రెస్ నుండి 82.8 కోట్లు రిజర్వ్ బ్యాంకుకు చేరాయి. వీటిలో ఐదువందల రూపాయాల నగదు నోట్లు 25 కోట్లు పంపారు. మూడు రోజుల్లో 8.3 కోట్లు పంపిణీ చేశారు, వాటిలో 3.75 కోట్లు ఐదువందల రూపాయాలను, జనవరి 31 నాటికి మరో 80 కరెన్సీ నోట్లు ముద్రించి పంపగలమని నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

English summary
new five hundred rupees currency notes will be release in large number from various reserve bank printing press. 1 crore new five hundred rupee currency note printing everyday from nasik printing press.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X