వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనీసవేతనాన్ని పెంచిన ఆ ప్రభుత్వం... పనిమనుషులకు వర్తిస్తుందా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కనీస వేతనాల పెంపునకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కొత్త రేట్లను లేదా పెంచిన రేట్లను వెల్లడించాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. అయితే కొత్త రేట్లకు సంబంధించి దీపావళికి ముందే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఇక ఢిల్లీలో పనిచేసే కార్మికుల కనీస వేతనం ప్రస్తుతం ఉన్నదానికంటే 11శాతం పెంచనున్నట్లు ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు.

కొన్ని అంశాల ఆధారంగా కనీస వేతనం ఫిక్స్

కొన్ని అంశాల ఆధారంగా కనీస వేతనం ఫిక్స్

కనీస వేతనం అనేది కార్మికులు చట్టపరంగా అదుకునే వేతనం. అయితే కనీస వేతనం నిర్ణయిస్తే ఇక అక్కడి నుంచి ఫలానా కార్మికుడు చేసే పని ఆధారంగా వేతనంను ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇక కనీసవేతనంను ఫిక్స్ చేసే క్రమంలో ప్రభుత్వం కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంది. జీవనం సాగించేందుకు కుటుంబంలోని నలుగురు ఆహారంపై ఎంత ఖర్చు చేస్తున్నారు, బట్టలు, నివాసం, విద్యుత్, ఇందనం మరియు చదువు అనే అంశాలను పరిగణలోకి తీసుకుని కనీస వేతనం ప్రభుత్వం ఫిక్స్ చేయనుంది.

2017లో కనీస వేతనం ఇలా ఉండేది

2017లో కనీస వేతనం ఇలా ఉండేది

కనీస వేతనంను చాలా రాష్ట్రాలు ఎప్పటికప్పుడు ఫిక్స్ చేస్తున్నాయి. ఢిల్లీలో మార్చి 2017లో చివరిసారిగా కనీసవేతనంను ఫిక్స్ చేశారు. ఆ సమయంలో అన్‌స్కిల్డ్ లేబర్‌కు రూ. 13,350 ఉండగా... సెమీ స్కిల్డ్ లేబర్‌కు రూ. 14698, మరియు స్కిల్డ్ లేబర్‌కు రూ.16,182గా ఉన్నింది. అయితే ఈ కనీసవేతనాలు క్రమపద్ధతిలో ఇస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఏదో వేతనం ఇవ్వాలి కాబట్టి యజమానులు కార్మికుల బ్యాంకు ఖాతాలోకి డబ్బులను బదిలీ చేసి ఆ తర్వాత తిరిగి తమ వద్ద నుంచి తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

 పనిమనుషులకు వర్తిస్తాయా..?

పనిమనుషులకు వర్తిస్తాయా..?

ఇక కనీసవేతనాలు ఇంటిలో పనిచేసే పనిమనుషులకు వర్తించవని తెలుస్తోంది. ఎందుకంటే పనిమనుషులు చేసే పని అనధికారికంగా ఉంటుందని కొందరు చెబుతున్నారు. అంతేకాదు వారు ఇంతకాలం పాటు చేయాలని ఒప్పందం కూడా ఉండకపోవడంతో వారిని పరిగణలోకి తీసుకోరనే వాదన వినిపిస్తోంది. అయితే పనినుషులు కూడా గంటల తరబడి పనిచేస్తారని వారిని కూడా గుర్తించి కనీస వేతనం అమలయ్యేలా చూడాలనే డిమాండ్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.

English summary
The minimum wages in the national capital are set to rise with the Supreme Court on Friday allowing the Delhi government to notify the enhanced rates, which will apply to workers in the national capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X