వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ట్రాఫిక్ రూల్స్ తిప్పలు...!టూ వీలర్‌తో తోసుకుంటూ వెళుతున్న రైడర్స్..!హల్‌చల్ చేస్తున్న వీడీయో

|
Google Oneindia TeluguNews

కేంద్రం నూతన మోటారు చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే..కొత్త చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల వాహానదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రతి నిబంధనకు వేల రూపాయల జరిమానాలు విధిస్తున్నారు. దీంతో ప్రజలు ఖంగు తింటున్నారు..ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ కొత్త నిబంధనలపై సోషల్ మీడీయాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. కొత్త చట్టం ప్రకారం హెల్మంట్ లేకుండా టూ వీలర్ నడిపితే రూ.1000 జరిమాన విధించారు.

ట్రాఫిక్ రూల్స్‌పై వైరల్ అవుతున్న వీడీయో


అయితే ట్రాఫిక్ రూల్స్ ప్రకారం విత్ ఆవుట్ హెల్మెంట్ లేకుండా నడిపుతూ పోలీసుల కంటపడితేనే కదా జరిమాన కట్టాల్సింది. అదే పోలీసులు ఉన్నప్పుడు హెల్మెంట్ లేకుండా టూ వీలర్‌ను నెట్టుకుంటూ పోతే పరిస్థితి ఏంటీ, అప్పుడు డ్రైవింగ్ లేకుండా నడుచుకుంటూ వెళ్లినట్టే కదా...ఇదే ఐడీయాతో రికార్డు చేసిన వీడీయో సోషల్ మీడీయాలో చక్కర్లు కొడుతుంది. ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు చెక్ చేస్తుంటూ మరోవైపు హెల్మెంట్ లేని వాహానదారులు వారి ముందు నుండి టూవీలర్‌తో నడుచుకుంటూ వెళుతున్నారు. ఇక హెల్మెంట్ ఉన్నవారు మాత్రం ధైర్యంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. దీంతో ఆ వీడీయో వైరల్ అవుతోంది.కాగా ఈ వీడియో నవ్వును తెప్పిస్తోందంటూ పంకజ్ నయిన్ అనే ఓ ఐపిఎస్ అధికారి సైతం ట్వీట్ చేశాడు.

<strong>వామ్మో జరిమానాల మోత.. ట్రాక్టర్ డ్రైవర్‌కు రూ.59 వేల ఫైన్.. ఎక్కడో తెలుసా..?</strong> వామ్మో జరిమానాల మోత.. ట్రాక్టర్ డ్రైవర్‌కు రూ.59 వేల ఫైన్.. ఎక్కడో తెలుసా..?

 కొత్త ట్రాఫిక్ చట్టాన్ని అమలు చేస్తున్న కొన్ని రాష్ట్రాలు

కొత్త ట్రాఫిక్ చట్టాన్ని అమలు చేస్తున్న కొన్ని రాష్ట్రాలు


కేంద్ర ప్రభుత్వం నూతన మోటారు సవరణ చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే..దీంతో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిన రాష్ట్రాల వాహానదారుల గుండేల్లో రైలు పరుగెడుతున్నాయి. కోత్త చట్టం ప్రకారం వాహనదారుల నుండి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిన డిల్లీ, హర్యాణ రాష్ట్రల్లో కొత్త చట్టం ప్రకారం చిన్న టూవీలర్ పైనే 23000 రూపాయల జరిమాన విధించగా ఆటో రిక్షాపై కూడ 33వేల రూపాయల జరిమాన విధించారు.

సోషల్ మీడీయా ప్రభావంతో ప్రభుత్వం దిగుతుందా..?

సోషల్ మీడీయా ప్రభావంతో ప్రభుత్వం దిగుతుందా..?

సోషల్ మీడీయా ప్రభావం గురించి తెలిసిందే ఇటివల చంద్రయాన్ 2 ప్రయోగాన్ని పురస్కరించుకుని నగర రోడ్లు అధ్వాన్నంగా నేపథ్యంలోనే బెంగళూర్ కు చెందిన ఓ త్రీడీ ఆర్టీస్టు విన్నూత్న ప్రయోగం చేశాడు. రోడ్లపై ఉన్న గుంతలకు తన సృజనాత్మకతను జోడించి సుమారు ఒక్క నిమిషం పాటు వీడీయో తీసిన ఆయన సోషల్ మీడీయాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆవీడీయో వైరల్ అయి అనంతరం అధికారులు స్పందించి రోడ్లపై ఉన్న గుంతలను సైతం పూడ్చారు. మరి సంధర్భానుసారంగా సోషల్ మీడీయాలో చక్కర్లు కొడుతున్న ఈవీడీయో ద్వారనైన కొత్త మోటారు చట్టంపై ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంపై ఏమైన స్పందిస్తాయో లేదో వేచి చూడాలి.

English summary
The implementation of the Motor Vehicles (Amendment) Act, 2019 has triggered hilarious memes on social media. Among them is a video showing how people can escape from getting fined.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X