• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారీ సంస్కరణ... దేశంలో 'విద్య' రూపు రేఖలు మార్పు... కొత్త పాలసీలో హైలైట్స్ ఇవే...

|

ప్రధాన నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ నూతన జాతీయ విద్యా విధానం 2020ని ఆమోదించింది. అలాగే కేంద్ర మానవ వనరుల శాఖ పేరును విద్యా శాఖగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్,రమేష్ పోఖ్రియల్ ఈ విషయాలను వెల్లడించారు. ఇకపై అన్ని ఉన్నత విద్యా సంస్థలకు ఒకే రెగ్యులేటరీ ఉంటుందని స్పష్టం చేశారు. 34 ఏళ్ల పాటు ఎలాంటి సంస్కరణలకు నోచుకోకుండా ఉన్న విద్యా విధానంలో ఇది కొత్త మార్పుకు శ్రీకారం చుడుతుందన్నారు.

  New National Education Policy 2020: 5+3+3+4 System, New Exams Pattern || Oneindia Telugu
  నిర్బంధ విద్య పొడగింపు

  నిర్బంధ విద్య పొడగింపు

  ప్రస్తుతం 14 ఏళ్ల లోపు విద్యార్థులకు అందిస్తున్న నిర్బంధ విద్యను నూతన విద్యా విధానం ద్వారా మూడేళ్ల నుంచి 18 ఏళ్ల లోపు విద్యార్థులకు పొడగించారు. 2025 నాటికి ప్రీ-ప్రైమరీ విద్యను విస్తృతం చేయడం,ప్రతీ ఒక్కరూ సాధారణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా కొత్త పాలసీని రూపొందించారు. లభ్యత,నాణ్యత,సమానత్వం,జవాబుదారీతనం ప్రాతిపదికన దీన్ని రూపొందించారు.

  5+3+3+4 పద్దతిలో...

  నూతన విద్యా విధానంలో పిల్లల వయసు కంటే వారి జ్ఞాన అభివృద్ది దశల ఆధారంగా 5+3+3+4 పద్దతిలో విద్యా విధానాన్ని రూపకల్పన చేశారు. దీన్ని ఫౌండేషనల్ స్టేజ్(3-8ఏళ్లు-గ్రేడ్స్ 1-2),ప్రీ-ప్రైమరీ,ప్రిపరేటరీ(8-12ఏళ్లు-గ్రేడ్స్-3-5),మిడిల్ స్టేజ్(11-14ఏళ్లు-గ్రేడ్స్-6-8),సెకండరీ స్టేజ్(14-18ఏళ్లు-గ్రేడ్స్-9-12)గా విభజించారు. ఇంటర్ విద్యను పూర్తిగా రద్దు చేశారు. డిగ్రీ కోర్సుల కాల పరిమితిని నాలుగేళ్లకు పొడగించారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో రీసెర్చ్‌ను కూడా భాగం చేసే అవకాశం ఉంది.

  ఐదు వరకు మాతృ భాషలోనే...

  ఐదు వరకు మాతృ భాషలోనే...

  కొత్త విద్యా విధానంలో విద్యార్థులు కళలు, మానవతా శాస్త్రాలు, క్రీడలు, ఇతర వృత్తిపరమైన సబ్జెక్టుల అధ్యయనానికి అవకాశం కల్పించారు. అలాగే 2-8ఏళ్ల వయసు నుంచే ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకునేలా విద్యా విధానాన్ని రూపొందించనున్నారు. దేశవ్యాప్తంగా 8 స్థానిక భాషల్లో ఈ-కోర్సులను అందుబాటులోకి తీసుకోనున్నారు. ఐదో తరగతి వరకూ అన్ని స్కూళ్లలోనూ మాతృ భాషలోనే విద్యా బోధనా జరిగేలా చర్యలు తీసుకోనున్నారు. 21వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంచేలా పాఠ్యాంశాల రూపకల్పన చేయనున్నారు. ఇందుకోసం ఆరో తరగతి నుంచే విద్యార్థులకు ప్రత్యేక పాఠ్యాంశాలు బోధించనున్నారు. ఇప్పటిలా బోర్డు పరీక్షల్లో విద్యార్థుల ఆలోచనా శక్తిని కాకుండా జ్ఞాన శక్తిని పరీక్షించేలా పరీక్షల రూపకల్పన చేయనున్నారు.

  సంస్కృతానికి ప్రాధాన్యం... ఏబీసీ ఏర్పాటు...

  సంస్కృతానికి ప్రాధాన్యం... ఏబీసీ ఏర్పాటు...

  కొత్త విద్యా విధానంలో సంస్కృతానికి ప్రాధాన్యత కల్పించనున్నారు. సంస్కృత విశ్వ విద్యాలయాలకు కూడా పెద్ద పీట వేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయనున్నారు. ఇకనుంచి పరిశోధనలో ఎంఫిల్‌‌ను పూర్తిగా రద్దు చేయనున్నారు. అకడమిక్ క్రెడిట్ స్కోర్‌ను డిజిటల్ పద్దతిలో నిక్షిప్తం చేసేలా అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్(ABC)ని ఏర్పాటు చేయనున్నారు.

  English summary
  The Union Cabinet on Wednesday approved the new National Education Policy (NEP) and renamed the HRD Ministry as Education Ministry. Making the announcement, Union Ministers Prakash Javadekar and Ramesh Pokhriyal Nishank said there would be a single regulator for all higher education institutions and MPhil would be discontinued.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X