• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముహూర్తం ఖరారు..! రెండు తెలుగు రాష్ట్రాల బీజేపి అధ్యక్షుల మార్పు అప్పుడే..!!

|

అమరావతి/హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ప్రక్షాళణ దిశగా అడుగులు వేస్తోంది. జాతీయ అధ్యక్షులుగా జయ ప్రకాశ్ నడ్డా పూర్తి బాద్యతలు తీసుకున్న తర్వాత ప్రాంతీయంగా పార్టీల బలోపేతం వైపు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా దక్షిణాది రాష్ఠ్రాల్లో పార్టీ సత్తా చాటాలంటే, ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలనేది బీజేపి లక్ష్యంగా తెలుస్తోంది. అందుకే వచ్చే నెలలో రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త అద్యక్షులను నియమించి అధికారం చేపట్టే దిశగా కసరత్తు చేయాలని బీజేపి అధిష్టానం కృత నిశ్యయంతో ఉన్నట్టు తెలుస్తోంది.

అదికారమే లక్ష్యం.. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బీజేపి కీలక మార్పులు...

అదికారమే లక్ష్యం.. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బీజేపి కీలక మార్పులు...

మార్చి నెల రెండో తారీఖు నుండి ఏప్రిల్ మూడో తారీఖు వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించేందుకు భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తోంది. దేశం మొత్తం మెజారీటి రాష్ట్రాల్లో బీజేపి హవా కొనసాగుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ప్రభావం చూపలేక పోతున్నామని కేంద్ర బీజేపి భావిస్తోంది. రాష్ట్రాలకు కేంద్ర వాటాలతో పాటు సంక్షేమ పథకాల్లో తమవంతు నిధులను సమకూర్చుతున్నప్పటికి ఎందుకు బీజేపికి ప్రజల్లో విశ్వాసం రావడం లేదనే అంశం పై లోతుగా విశ్లేషణ చేస్తోంది కాషాయ పార్టీ.

ప్రజాకర్షణ ఉన్న నేతల కోసం అణ్వేషణ.. ఏప్రిల్ లో కొత్త అధ్యక్షులు..

ప్రజాకర్షణ ఉన్న నేతల కోసం అణ్వేషణ.. ఏప్రిల్ లో కొత్త అధ్యక్షులు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో సమర్ధవంతమైన నాయకులును నియమించి వచ్చే ఎన్నికల్లో ప్రభావవంతంగా పనిచేసేందకు దిశా నిర్దేశం చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా సమూల మార్పులు చేయడంతో పాటు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కూడా భావిస్తోంది. జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటే 2022 లేదా 2023లోనే సార్వత్రిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వేగంగా పావులు కదిపేందకు బీజేపి అదిష్టానం సమాయత్తమవుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతమున్న అధికార పార్టీలను ధీటుగా ఎదుర్కొని పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించే నాయకత్వం కోసం బీజేపి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

క్షేత్ర స్థాయిలో బీజేపి బలోపేతం.. అదే కాషాయ పార్టీ లక్ష్యం...

క్షేత్ర స్థాయిలో బీజేపి బలోపేతం.. అదే కాషాయ పార్టీ లక్ష్యం...

అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లో మంచి ఛరిష్మా ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని ప్రణాళికలు రచిస్తోంది. ప్రజల్లో ఏకాభిప్రాయం తీసుకురావడంతోపాటు పార్టీలో నెలకొన్న విభేధాలను తొలగించి పార్టీని ముందుకు నడిపే నాయకత్వ లక్షణాలున్న నాయకుల కోసం బీజేపి అణ్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా చేజారి పోతున్న కార్యకర్తల్లో మనోస్త్తైర్యాన్ని నింపి, పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపి అధినాయకత్వం. అంతే కాకుండా ఝార్కండ్, ఢిల్లీ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలైన అంశాలను పరిగణలోకి తీసుకుని పకడ్బంధీగా అడుగులు వేయాలనుకుంటోంది బీజేపి.

దక్షిణాదిపై పట్టు కోసం బీజేపి గురి.. సమర్ధవంతమైన నేతలకోసం కసరత్తు..

దక్షిణాదిపై పట్టు కోసం బీజేపి గురి.. సమర్ధవంతమైన నేతలకోసం కసరత్తు..

ప్రధానంగా ప్రాంతీయంగా ఉండే సామిజిక వర్గాలను దృష్టిలో ఉంచుకోవడమే కాకుండా, మహిళలలు, విద్యార్థులు, నిరుద్యోగులకు నమ్మకమైన నేతతో పాటు, అట్టడుగు వర్గాలైన ఎస్టీ, ఎస్సీ, బీసిలతో పాటు మైనారిటీ వర్గాలను ఆర్శించే నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ అధ్యక్షులుగా పని చేస్తున్న తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, ఏపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు వారుసులను ఎంపిక చేయాలని బీజేపి తీవ్ర కసరత్తు చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపితే దక్షిణ భారత దేశంలో బీజేపికి తిరుగుతేదని ఆపార్టీ భావిస్తోంది. అందుకు తగ్గట్టే అద్యక్షుల మార్పుతో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని బీజేపి అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది.

English summary
The Bharatiya Janata Party is stepping in to purge. It seems that Jaya Prakash Nadda has taken full responsibility as national president and plans to strengthen the parties regionally. Besides, the BJP seems to be aiming to be in the front two Telugu states if the party is in the south.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X