వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోగ్యసేతు యాప్‌ పై కొత్త ప్రోటోకాల్స్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..ఏమిటంటే..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశాన్ని వణికిస్తున్న కోవిడ్-19 నుంచి కొంత జాగ్రత్త పడేందుకు ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు అనే యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ యాప్‌పై మొదటి నుంచి పలు అనుమానాలు కొందరు నిపుణులు వ్యక్తం చేస్తుండటంతో తాజాగా మరికొన్ని ప్రోటోకాల్స్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అంతేకాదు డేటాను ఎలా సేకరిస్తున్నారు వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే దానిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

ఆరోగ్య సేతు యాప్: ఫీచర్ పోన్, ల్యాండ్‌లైన్ నుంచి 1921కి డయల్ చేస్తే చాలు.. వెంటనే కాల్ఆరోగ్య సేతు యాప్: ఫీచర్ పోన్, ల్యాండ్‌లైన్ నుంచి 1921కి డయల్ చేస్తే చాలు.. వెంటనే కాల్

 సమాచార వివరాలను కుదించిన కేంద్ర ప్రభుత్వం

సమాచార వివరాలను కుదించిన కేంద్ర ప్రభుత్వం

ఆరోగ్యసేతు డేటా యాక్సెస్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ ప్రోటోకాల్, 2020 పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. సమాచారం పేరుతో ఇప్పటి వరకు సేకరించిన వివరాలను కుదించింది. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారు వారి ఆరోగ్య వివరాలు వెల్లడించడం వారు ఎవరెవరితో కాంటాక్ట్‌లోకి వచ్చారో స్పష్టం చేయడం వంటి వాటిపై కొన్ని జాగ్రత్తలు తీసుకుని కుదించింది కేంద్ర ప్రభుత్వం. ఇక సేకరించిన సమాచారం 180 రోజుల వరకు మాత్రమే ఉంటుందని పేర్కొన్న కేంద్రం... ఒకవేళ ఇన్‌ఫెక్షన్ లేని వారి సమాచారం 45 రోజులు, ఇన్‌ఫెక్షన్ ఉన్నవారి సమచారం 60 రోజులుగా ప్రస్తుతం ఉందని నీతి ఆయోగ్ అధికారులు చెబుతున్నారు. ఇక డెమొగ్రాఫిక్ డేటా యూజర్ రిక్వెస్ట్‌ మేరకే ఉంటుందని వెల్లడించింది. ఒకవేళ పేరు, మొబైల్ నెంబర్, వయస్సు, లింగం, ట్రావెల్ హిస్టరీ, ప్రొఫెషన్‌లాంటి అంశాలు ఇవ్వాలా వద్దా అనేది యూజర్‌ ఇష్టం మేరకే ఉంటుందని నీతి ఆయోగ్ వెల్లడించింది.

 సర్వర్లపై 12వేల మంది డేటా

సర్వర్లపై 12వేల మంది డేటా

ఇక ఆరోగ్యసేతు యాప్‌‌తో వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురయ్యే అవకాశం ఉందన్న విమర్శలు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై వివరణ ఇచ్చింది. ఇప్పటి వరకు 98 మిలియన్ డౌన్‌లోడ్‌లు అయ్యాయని ఇందులో 12వేల మందికి సంబంధించిన డేటా సర్వర్లపై స్టోర్ అయి ఉందని మైగౌ సీఈఓ అభిషేక్ సింగ్ చెప్పారు. ఇక ఈ యాప్ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్న నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వివరణ ఇచ్చింది. ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారి సమాచారం లేదా ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నవారి సమాచారం మాత్రమే సేకరించిపెడుతున్నట్లు ఎన్ఐసీ తెలిపింది. ప్రజల ఆరోగ్య భద్రత ప్రభుత్వంపై ఉన్న నేపథ్యంలో వీరికి సంబంధించిన సమాచారం ఆయా ప్రభుత్వాలతో పంచుకుంటామని వెల్లడించింది. అంతేకాదు ఈ సమాచారం ఎవరెవరితో షేర్ చేశామనేదానిపై కూడా ఒక జాబితా తయారు చేసి పెడుతున్నట్లు వెల్లడించింది. ఈ డేటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో అనుబంధంగా కొనసాగే సంస్థలకు కూడా అందజేస్తామని ఎన్ఐసీ పేర్కొంది. ఇది ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

Recommended Video

Vande Bharat Mission : 118 Indian citizens from San Francisco arrive in Hyderabad
 డ్యూటీలో భాగంగా తిరిగే వారికి యాప్ తప్పనిసరి

డ్యూటీలో భాగంగా తిరిగే వారికి యాప్ తప్పనిసరి

తొలుత కరోనావైరస్ కాంటాక్‌లను మాత్రమే గుర్తించేందుకు రూపొందించిన ఈ ఆరోగ్య సేతు యాప్... ఇప్పుడు ఈ-పాస్ , టెలిమెడిసిన్ ఇచ్చేలా, పనిచేసేవారు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ ఇన్స్‌టాల్ చేసుకోవాలంటూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది. ఇక ఈ యాప్‌పై పలువురు డిజిటల్ రంగ నిపుణులు విమర్శలు గుప్పించారు. లొకేషన్ గుర్తించడంతో పాటు పలు భద్రతాలోపాలు ఉన్నాయని చెప్పారు. ఆరోగ్య సేతు యాప్‌ పూర్తి భద్రత లేదని హ్యాకర్లు కొన్ని మిలియన్ మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం తస్కరించే అవకాశం ఉందని ఫ్రెంచ్ కంప్యూటర్ ప్రోగ్రామర్ గతవారం తెలిపారు.

English summary
The Aarogya Setu app, which was launched to trace the contacts of individuals who have contracted the coronavirus disease (Covid-19), has now been expanded to issue e-passes, provide telemedicine and is mandatory for travel to work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X