వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులకు సపోర్ట్‌గా ఉంటారెమే..? పంజాబ్ కొత్త సీఎంపై అమరీందర్ సింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ సింగ్ చానీ సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11 గంటలకు సీఎంగా బాధ్యతలు చేపడుతారు. దళిత నేతకు.. కాంగ్రెస్ హై కమాండ్ సీఎం పగ్గాలు అప్పగించింది. ఈ అంశంపై మాజీ సీఎం అమరీందర్ సింగ్ స్పందించారు. అమర్- సిద్దు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమర్ తన పదవీకి రాజీనామా చేశారు. అమర్ రాజీనామా చేసిన 24 గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన వారసుడి పేరును ప్రకటించింది.

రైతు సమస్యలపై రైతుల ఆందోళన కొనసాగుతోంది. 150 మంది రైతులు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే వారి కుటుంబాల్లో ఒకరికి జాబ్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. వారికి నియామకపు పత్రం తాను ఇవ్వలేకపోయాననే బాధ ఉందని చెప్పారు. దీనికి సంబంధించి మంత్రివర్గం ఇదివరకే ఆమోదం తెలిపిందని చెప్పారు. బాధిత కుటుంబాలకు కొత్త సీఎం అండగా నిలుస్తారని అమరీందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

పంజాబ్ ప్రభుత్వం రైతులకు అనుకూలంగా వ్యవహరించాలని అమరీందర్ కోరారు. రైతులు చేపట్టే ఆందోళనకు తాను మద్దతు తెలుపుతానని అమరీందర్ తెలిపారు. చనిపోయిన 298 మంది రైతులు కుటుంబాలకు 14.85 కోట్ల పరిహారం అందజేశామని తెలిపారు. అన్నదాతలు దేశానికి వెన్నెముక అని తెలియజేశారు. మరో 51 మంది కుటుంబాలకు కూడా పరిహారం అందజేస్తామని చెప్పారు. తనతో పనిచేసిన అధికారులు/ సిబ్బందికి అమరీందర్ ధన్యవాదాలు తెలియజేశారు. నాలుగున్నరేళ్ల నుంచి రాష్ట్ర అభివృద్ది కోసం పాటుపడ్డారని కొనియాడారు.

 new Punjab CM will stand with farmers in their battle: Amarinder Singh

Recommended Video

Kohli to step down as RCB captain after IPL 2021

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. చరణ్‌జిత్ సింగ్ చన్నీని పంజాబ్ సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి హరీశ్ రావత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.దీంతో పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్‌కు తెరదించినట్లయింది. తాజా మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేబినెట్‌లో చరణ్‌జిత్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన నేత. ప్రస్తుతం చామకౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2007లో ఇక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... ఇప్పటివరకూ మూడుసార్లు ఇదే నియోజవకవర్గం నుంచి గెలుపొందారు. 2015-2016లో పంజాబ్ అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.

English summary
Captain Amarinder Singh stepped down as the chief minister of Punjab on Saturday following months of infighting between him and Punjab Pradesh Congress Committee chief Navjot Singh Sidhu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X