వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు ఏప్రిల్ షాక్: తక్కువ హైరింగ్.. ఎక్కువ ఫైరింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలు, బ్రిటన్ తదితర దేశాల ఆత్మరక్షణ ధోరణులు ప్లస్ ఆటోమేషన్ ప్రభావం క్రమంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని అతలాకుతలం చేస్తోంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలు, బ్రిటన్ తదితర దేశాల ఆత్మరక్షణ ధోరణులు ప్లస్ ఆటోమేషన్ ప్రభావం క్రమంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. దేశంలోని ఐటీ దిగ్గజాల్లో పని చేస్తున్న ఉద్యోగులపై ఉద్వాసన కత్తి వేలాడుతున్న సంగతి తెలిసిందే.

పనితీరు సరిగా కనబర్చని ఉద్యోగులపై ఏ క్షణంలోనైనా వేటు వేసే పరిస్థితి నెలకొంది. ఇతర మౌలిక వసతుల రంగం, ఉత్పాదక రంగ పరిశ్రమల్లోనూ నియామకాలు తగ్గుముఖం పట్టడం ఆందోళనకరమేనని విశ్లేషకులు చెప్తున్నారు.
ఇక గత ఏడాదితో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగ నియామకాలు 24 శాతం తగ్గాయని ప్రముఖ జాబ్‌సైట్ నౌకరీ.కామ్ నిర్వహించిన అధ్యయనం నిగ్గు తేల్చింది.

గతనెల జాబ్ మార్కెట్‌లో కొత్త ఉద్యోగాల కల్పన 11 శాతం తగ్గిందని, ఐటీ ఇండస్ట్రీలో నియామకాల ప్రక్రియ భారీగా తగ్గడమే ఇందుకు కారణమని నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. ఐటీ దిగ్గజాలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయని పెద్దఎత్తున ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో విడుదలైన ఈ నివేదిక పరిశ్రమ పరిస్థితులపై మరింత కలవరపెడుతున్నది.

ఉద్వాసనతోపాటు నియమాకాల్లోనూ కోతే

ఉద్వాసనతోపాటు నియమాకాల్లోనూ కోతే

నౌకరీ డాట్ కాం సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం సాఫ్ట్‌వేర్ సంస్థలు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల ఉద్వాసనతోపాటు కొత్తవారి నియామకాలూ తగ్గించుకుంటున్నాయని అర్థమవుతున్నది. ఐటీ రంగ అసోసియేషన్ నాస్కామ్ మాత్రం ఇందుకు భిన్నంగా వాదిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీలు నికరంగా 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని గతవారం నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ అన్నారు.

మెట్రో పాలిటన్ నగరాల్లో తగ్గిన రిక్రూట్ మెంట్లు

మెట్రో పాలిటన్ నగరాల్లో తగ్గిన రిక్రూట్ మెంట్లు

దేశంలోని నాలుగు అతిపెద్ద మెట్రో నగరాలైన ఢిల్లీ, ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై పరిధిలో రిక్రూట్‌మెంట్ గణనీయంగా తగ్గిందని నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ పేర్కొన్నది. ఢిల్లీ/ఎన్‌సీఆర్‌లో 28 శాతం, ముంబైలో 18 శాతం, చెన్నైలో 29 శాతం, బెంగళూరులో 28 శాతం, కోల్‌కతాలో 10 శాతం, అహ్మదాబాద్‌లో 19 శాతం తగ్గింది.

ఒడిదొడుకుల్లో జాబ్ మార్కెట్

ఒడిదొడుకుల్లో జాబ్ మార్కెట్

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో ఏప్రిల్‌లో టెలికం, బీపీవో, ఇన్సూరెన్స్, నిర్మాణ రంగాల్లో నియామకాలు తగ్గాయని తెలిపింది. బీపీవో/ఐటీఈఎస్ రంగంలో హైరింగ్ 10 శాతం, నిర్మాణ రంగంలో 12 శాతం, బ్యాంకింగ్ రంగంలో 11 శాతం తగ్గిందని సంస్థ తెలిపింది. ముందుగా అంచనా వేసినట్లుగానే జాబ్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నది.

11 శాతం తగ్గిన నియామకాలు

11 శాతం తగ్గిన నియామకాలు

గతనెలలో ఉద్యోగాల కల్పన 11 శాతం తగ్గుదలను నమోదు చేసుకుంది అని నౌకరీ.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వీ సురేశ్ అన్నారు. ప్రధానంగా ఐటీ, టెలికం, బీపీవో, బీమా, నిర్మాణ రంగాల్లో నియామకాలు భారీగా తగ్గుముఖం పట్టాయని, అన్ని రంగాల్లోనూ యాజమాన్యాలు కొత్త వారి నియామకం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయన్నారు. మరికొన్ని నెలలపాటు మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చని సురేశ్ అంచనా వేస్తున్నారు.

అమెరికాలో నాస్కామ్ లాబీయింగ్‌ తీవ్రతరం

అమెరికాలో నాస్కామ్ లాబీయింగ్‌ తీవ్రతరం

అమెరికాలో వీసా నిబంధనల్లో వస్తున్న మార్పులతో భారత ఐటీ సంస్థలకు ప్రతికూల వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలో.. భారత ఐటీ సంస్థల సంఘం నాస్కామ్‌ లాబీయింగ్‌ను తీవ్రం చేసింది. అమెరికా చట్ట సభ సభ్యులతో మంతనాల కోసం పెడుతున్న వ్యయాన్ని.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దాదాపు 25 శాతం పెంచింది. ఈ మేరకు అమెరికా సెనేట్‌కు సమర్పించిన నివేదికల్లో నాస్కామ్‌ ఈ సంగతి తెలిపింది. గతేడాది ఒక్కో త్రైమాసికానికి లాబీయింగ్‌ కోసం రూ.70 లక్షలు నాస్కామ్‌ ఖర్చు పెట్టింది.

ఈ ఏడాది మార్చితో ముగిసే త్రైమాసికానికే రూ.96 లక్షల వ్యయం

ఈ ఏడాది మార్చితో ముగిసే త్రైమాసికానికే రూ.96 లక్షల వ్యయం

ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.96 లక్షలు వెచ్చించింది. వెక్స్‌లర్‌ వాల్కర్‌కు రూ.64 లక్షలు, ది లాండె గ్రూప్‌నకు రూ.32 లక్షలు లాబీయింగ్‌ చేసేందుకు చెల్లించింది. వలసవిధానం, గ్రీన్‌కార్డులు, వీసా ప్రాసెసింగ్‌, అమెరికా-భారత్‌ సంబంధాలు, పన్ను సంస్కరణలు తదితర అంశాలపై వివిధ ఫెడరల్‌ సంస్థలతో ‘ది లాండె' మధ్యవర్తిత్వం జరిపింది. వలసవిధానం, పన్నులు, వాణిజ్యపరమైన అంశాల్లో కాంగ్రెస్‌ ఉభయ సభలు, ఫెడరల్‌ సంస్థలతో వెక్స్‌లర్‌ వాకర్‌ నాస్కామ్‌ తరఫున మంతనాలు జరిపింది.

కోర్టు మెట్లెక్కనున్న ఐటీ ఉద్యోగులు

కోర్టు మెట్లెక్కనున్న ఐటీ ఉద్యోగులు

ఐటీ రంగంలో నెలకొన్న ఉద్యోగాల కోతపై కంపెనీల ఉద్యోగులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. కావాలనే ఉద్వాసన వేటు వేస్తుండటంతో ఇప్పటికే కంపెనీలకు వ్యతిరేకంగా లేబర్ కమిషన్, లేబర్ సెక్రటరీ, రాష్ట్రప్రభుత్వాలను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు, ఇక కోర్టు మెట్లెక్కేందుకు సిద్ధమవుతున్నారు. కంపెనీలు చేస్తున్న అన్యాయమైన తొలగింపును హైకోర్టు ముందు వినిపించాలని భావిస్తున్నారు. నేషనల్ డెమొక్రాటిక్ లేబర్ ఫ్రంట్ (ఎన్డీఎల్ఎఫ్) ఐటీ ఉద్యోగుల వింగ్ తమ గోడును వినిపించుకోవడానికి మద్రాస్ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

English summary
IT and other key industries are struggling in new recruitment. Trump restrictions and other Nations applied protectionism policy affected on IT industry while automation also one reason to decrease new recruitment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X